రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

03 & 04 ఫిబ్రవరి 21 తేదీల్లో గ్లోబల్ చీఫ్స్‌ ఆఫ్‌ ఎయిర్ స్టాప్‌ సదస్సు నిర్వహించిన ఐఏఎఫ్‌

Posted On: 05 FEB 2021 9:33AM by PIB Hyderabad

03 & 04 ఫిబ్రవరి 21 తేదీల్లో భారత వైమానిక దళం రెండు రోజుల గ్లోబల్ చీఫ్స్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ కాన్క్లేవ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఏరో ఇండియా-21లో 2 మరియు 3 వ రోజున 'భద్రత మరియు స్థిరత్వం కోసం వైమానికి శక్తిని పెంచడం' అనే అంశంపై ఈ సమావేశాన్ని 03 ఫిబ్రవరి 21న  గౌరవ రక్షణ మంత్రి ప్రారంభించారు. రక్షణ మంత్రి తన ప్రారంభ ప్రసంగంలో సీఎఎస్‌ కాన్క్లేవ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైమానిక దళాలకు చెందిన ముఖ్యులను మరియు సీనియర్ ప్రముఖులను ఒకచోట చేర్చిందని చెప్పారు.  ఏరో ఇండియాలో భాగంగా వైమానిక శక్తి  మరియు అనుబంధ సాంకేతికతలు ఒకేచోటు చేరాయన్నారు. ప్రారంభ సెషన్‌లో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పాల్గొన్నారు.

అతిథులను స్వాగతిస్తూ, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కెఎస్ భదౌరియా ఆలోచనలను పంచుకునేందుకు మరియు వైమానిక దళాల మధ్య బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించడంలో సీఎఎస్ కాన్క్లేవ్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం మరియు భద్రతను నిర్ధారించడానికి కీలకమైన సహాయకుడిగా వైమానికి శక్తి పాత్రను ఆయన పునరుద్ఘాటించారు.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షల కారణంగా ఈ సదస్సు హైబ్రిడ్  విధానంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి 50 దేశాలు హాజరయ్యాయి. ఫిబ్రవరి 03 & 04 తేదీల్లో  28 దేశాల వైమానిక దళాల చీఫ్‌లు / కమాండర్లు కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. ఏరోస్పేస్ రంగంలో సమకాలీన ఆంశాలు, ఇతివృత్తాలపై ఆయా దేశాల ప్రతినిధులు ఆలోచనలు పంచుకోవడంతో పాటు ఉత్తమ విధానాల అమలు కోసం కాన్క్లేవ్ రూపొందించబడింది. సదస్సులో  అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, పశ్చిమ ఆసియా, మధ్య ఆసియా రిపబ్లిక్, సౌత్ ఈస్ట్ ఆసియా, ఆఫ్రికా, హిందూ మహాసముద్ర ప్రాంతం మరియు ఇండో పసిఫిక్ దేశాలు, ఖండాల నుండి వైమానిక దళాలు పాల్గొన్నాయి.

సిఏఎస్ కాన్క్లేవ్ యొక్క మూడు సెషన్లు ఏరోస్పేస్ వ్యూహానికి సంబంధించి ముఖ్యమైన సమస్యలను చర్చించడానికి ఒక ఫోరమ్ను అందించాయి. యుద్ధ క్షేత్రాన్ని ప్రభావితం చేసే అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు మరియు గ్లోబల్ కామన్స్ యొక్క భద్రత మరియు స్థిరత్వానికి సంబంధించిన సమస్యలు చర్చకు వచ్చాయి. ఈ సదస్సులు “డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్స్”, “ఇండో-పసిఫిక్ రీజియన్‌లో వైమానికి శక్తి ” మరియు “ఎయిర్ పవర్ అండ్ ఏరోస్పేస్ స్ట్రాటజీ” యొక్క ఇతివృత్తాలను పరిష్కరించడానికి ప్రణాళిక చేయబడ్డాయి.

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, నామినేటెడ్ దేశ ప్రతినిధులు మరియు సభ్యులకు  కాన్క్లేవ్ సందర్భంగా వారు చేసిన విలువైన కృషికి సిఎస్ఎస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కాన్క్లేవ్ వాయుసేనల మధ్య అవగాహన మరియు సహకారాన్ని పెంచుతుంది. అలాగే మెరుగైన బహుపాక్షిక సామర్థ్యాలను ఏర్పరచటానికి సహాయపడుతుంది అని చెప్పారు.(Release ID: 1695399) Visitor Counter : 176