మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

రాష్ట్రాలు అనుమ‌తిచ్చిన ప్రాంతాల‌లో X, XII త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కుఉ భౌతిక త‌ర‌గ‌తుల‌ను ప్రారంభించ‌నున్న జెఎన్‌విలు

Posted On: 03 FEB 2021 4:52PM by PIB Hyderabad

కేంద్ర హోం, ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌లు జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ఆధారంగా జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల‌ను తిరిగి తెరిచేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ఎస్ ఒపిని త‌యారు చేసింది. అన్ని జెఎన్‌వీల‌ను శానిటైజ్ చేయ‌డం, త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణకు ఏర్పాట్లు, సామాజిక దూరం పాటిస్తూ హాస్ట‌ల్‌లో ఉండేందుకు విద్యార్ధుల‌కు ఏర్పాట్లు, అత్యవ‌స‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు కోవిడ్ నిర్వ‌హ‌ణ  ప్రోటోక‌ల్ త‌యారీ వంటి ముంద‌స్తు చ‌ర్య‌ల‌ను ఇప్ప‌టికే జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాలు తీసుకున్నాయి. 
విద్యా శాఖ ఎస్ ఒపి ఆధారంగా ప్ర‌తి పాఠ‌శాల కూడా టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి కోవిడ్ ప‌రిస్థితిని ప్ర‌భావ‌వంతంగా నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎస్ ఓపి ఆధారంగానూ, జిల్లా పాల‌నాధికారులతో సంప్ర‌దించి త‌న స్వంత ఎస్ ఓపని త‌యారు చేసింది. త‌ల్లిదండ్రుల అనుమ‌తి ఇచ్చిన విద్యార్ధుల‌కు భౌతిక క్లాసుల‌ను నిర్వ‌హించేందుకు జె ఎన్‌విలు సంసిద్ధంగా ఉన్నాయి. మిగిలిన విద్యార్ధుల విష‌యానికి వ‌స్తే, విద్యా సంవ‌త్స‌రం న‌ష్ట‌పోకుండా ఆన్‌లైన్ క్లాసులు కొన‌సాగుతాయి.  ఇక భౌతిక త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యే విద్యార్ధుల‌ను ద‌శ‌ల‌వారీగా పిల‌వ‌నున్నారు, ఈ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్దేశాన‌ల‌ను క‌ఠినంగా అనుస‌రించ‌నున్నారు. రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల అయినందున మాస్కు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించ‌డం, త‌ర‌చుగా చేతులు క‌డుక్కోవ‌డం, శానిటైజేష‌న్‌కు అత్యంత ప్రాముఖ్య‌త‌ను ఇవ్వ‌నున్నారు. అందుకు అనుగుణంగానే, ప‌ది, ప‌న్నెండ‌వ త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు పాఠ‌శాల‌ల‌ను తెర‌వ‌డానికి రాష్ట్ర  ప్ర‌భుత్వాలు అనుమ‌తించిన‌ జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాలు తెర‌వ‌నున్నారు. ఇక, వ‌స‌తి, ఇత‌ర ప‌రిక‌రాలు అందుబాటు ఆధారంగా ఇత‌ర త‌ర‌గతుల‌ను తెరిచేందుకు త‌దుప‌రి నిర్దేశాల‌ను త్వ‌ర‌లో జారీ చేయ‌నున్నారు. 
కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి మార్చి -2020లో విజృంభించిన అనంత‌రం ట‌ర్మ్ ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేసి, జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల‌ను వేస‌వి శ‌ల‌వ‌ల‌కు మూసివేశారు. ఇ-కంటెంట్ అభివృద్ధి, ఆన్‌లైన్ క్లాసుల నిర్వ‌హ‌ణ‌, ఆన్‌లైన్ అంచ‌నాలు వేయ‌డంలో ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ‌ను ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాలు 15 జూన్‌, 2020 నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభ‌మ‌య్యాయి. నిర్ణీత కాలంలో ఆన్‌లైన్ అసెస్‌మెంట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్ త‌ర‌గతుల‌కు హాజ‌ర‌య్యేందుకు అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాలు లేని విద్యార్ధుల‌కు టెక్స్ట్ బుక్స్‌, అసైన్‌మెంట్లు, క్వ‌శ్చ‌న్ బ్యాంకు త‌దితరాల‌ను ప్ర‌త్యేక మెసెంజ‌ర్‌/ త‌ల్లిదండ్రులు/  పోస్ట్ ద్వారా లెర్నింగ్ మెటీరియ‌ల్‌ను అందించ‌నున్నారు. 

***


(Release ID: 1695043) Visitor Counter : 186