ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ 58 వ జాతీయ సదస్సుకు డిజిటల్ విధానంలో అధ్యక్షత వహించిన డాక్టర్ హర్ష్‌వర్ధన్

"మన గౌరవనీయమైన ప్రధాన మంత్రి కల అయిన డిజిటల్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కృషి చేస్తోంది"

Posted On: 03 FEB 2021 3:19PM by PIB Hyderabad

ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్‌ 58వ జాతీయ సదస్సుకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ డిజిటల్ విధానంలో అధ్యక్షత వహించారు.

ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రచనలను అభినందిస్తూ డాక్టర్ హర్ష్ వర్ధన్ "ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఆంశాలపై భారత ప్రభుత్వంతో నిరంతరం పనిచేస్తుందని నాకు తెలుసు. పోలియో నిర్మూలన, రోగ నిరోధకత, జంక్ ఫుడ్‌లపై మార్గదర్శకాలు, మహమ్మారి సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్, జాతీయ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా క్షయవ్యాధికి వ్యతిరేకంగా పోరాటం, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడం, అలాగే కౌమార ఆరోగ్యం వంటి వాటిలో మీ పని మరియు కృషి ఎంతో గొప్పవి. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ 30,000 మందికి పైగా ఉన్న దాని సభ్యులు మరియు రాష్ట్ర శాఖలతో పాటు 350 నగర శాఖలు పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ప్రభుత్వ కార్యకలాపాలకు తోడ్పడటానికి చాలా మంచి మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయి." అని చెప్పారు.

తల్లిదండ్రుల మార్గదర్శినిపై కేంద్ర మంత్రి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిల్లలకు సంబంధించిన సుమారు 100 సాధారణ పరిస్థితులపై అకాడమీ ఈ సంవత్సరం రచనలు చేయాలని యోచిస్తుండడంపై మంత్రి మాట్లాడుతూ" ఇది చాలా మంచి మరియు ఉపయోగకరమైన రచన మరియు భారతీయ తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరమైనది అవుతుంది. అవి చాలా భారతీయ భాషలలో సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకోవడం మరింత ప్రశంసనీయం." అని కొనియాడారు.

సమావేశంలో ఆయన మాట్లాడుతూ.." మీరు నవజాత్ శిషు సురాక్ష కార్యక్రామ్ (ఎన్‌ఎస్‌ఎస్ఆర్) మాడ్యూల్ ఆధారంగా ఆన్‌లైన్ సాధనాలను అభివృద్ధి చేశారని నేను అభినందిస్తున్నాను. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తన డిఐఎపి ప్లాట్‌ఫామ్ ద్వారా గత సంవత్సరంలో ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమం పూర్తి చేసింది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మన గౌరవప్రదమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ  యొక్క డిజిటల్ ఇండియాతో పాటు ఆత్మనిర్భర్‌ భారత్‌ కలను సాకారం చేస్తోంది. ఈ నైపుణ్యాన్ని ఉపయోగించడం ద్వారా ఈ ఆన్‌లైన్ సాధనాలు చేరుకోని, శిక్షణ ఖర్చును తగ్గించడంలో మరియు మానవశక్తి అవసరాన్ని తగ్గించడంలో చాలా ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను "అని అన్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ యొక్క కృషిని గుర్తిస్తూ డాక్టర్ హర్ష్ వర్ధన్ "మీరు శిక్షకుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మధ్యప్రదేశ్‌లో నియోనాటల్ మరణాలను తగ్గించే లక్ష్యంతో ఉన్నాను. మధ్యప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మీరు రూపొందించిన ఈ కార్యక్రమం ఆరు అధిక ప్రాధాన్యత గల జిల్లాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తుందని, తదనంతరం మొత్తం రాష్ట్రంలో మరియు తరువాత మొత్తం దేశంలో విడుదల చేయబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భారత ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇస్తున్నాను." అని చెప్పారు.

"యునిసెఫ్ మరియు డబ్ల్యూహెచ్ఓలచే నిధులు సమకూర్చిన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్‌కు చెందిన మరొక ప్రధాన ప్రాజెక్ట్ ఎర్లీ చైల్డ్ డెవలప్‌మెంట్‌ కూడా మార్గదర్శకం అవడంతో పాటు మన భవిష్యత్ పౌరులు పూర్తి సామర్థ్యాన్ని అందుకునేలా చేస్తుంది." అని కేంద్రమంత్రి తెలిపారు.

తన అధ్యక్ష ప్రసంగాన్ని ముగుస్తూ డాక్టర్ వర్ధన్‌  1994 లో దేశంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వారి విలువైన సలహాలు, మార్గదర్శకత్వం మరియు సహకారాన్ని అందించినందుకు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది గొప్ప మరియు చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 20 సంవత్సరాల తరువాత 2014 లో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పోలియో ఫ్రీ ఇండియాగా దేశం గుర్తించబడింది.

***



(Release ID: 1694843) Visitor Counter : 166