రక్షణ మంత్రిత్వ శాఖ
ఎన్‌జిఒ లు/ప్రైవేటు పాఠశాల లు/రాష్ట్రాల భాగస్వామ్యం తో కొత్త గా 100 సైనిక్ స్కూల్స్ ను ఏర్పాటుచేయాలని కేంద్ర బడ్జెటు లో ప్రాతిపాదించడమైంది
Posted On:
02 FEB 2021 4:13PM by PIB Hyderabad
దేశం లో కొత్త గా 100 సైనిక్ స్కూళ్ళను ఎన్‌జిఒ లు/ ప్రైవేటు పాఠశాలలు/ రాష్ట్రాల యాజమాన్యం లోని పాఠశాలల భాగస్వామ్యం తో ఏర్పాటు చేయాలని 2021-22 వ ఆర్థిక సంవత్సరానికి ఉద్దేశించిన కేంద్ర బడ్జెటు లో ప్రతిపాదించడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ సోమవారం నాడు పార్లమెంటు లో ప్రవేశపెట్టారు. తమ పాఠశాలల్లో సైనిక్ స్కూళ్ళ తాలూకు సంస్కృతి ని అనుసరిస్తూ ‘సిబిఎస్ ప్లస్’ తరహా విద్యావ్యవస్థ ను అందించాలన్న ఆసక్తి కలిగిన ప్రభుత్వ పాఠశాల లు/ ప్రైవేటు పాఠశాల లు/ఎన్‌జిఒ లతో కలిసి ముందంజ వేయాలనేదే ఈ ప్రతిపాదన తాలూకు ఉద్దేశ్యంగా ఉంది. ఇప్పటికే నడుస్తున్న పాఠశాల లను, త్వరలో ఏర్పాటు కాబోయే పాఠశాలల ను సైనిక్ స్కూళ్ళ పాఠ్య ప్రణాళిక కోవలో చేర్చాలి అని సంకల్పించారు.
ఈ నూతన పాఠశాల లను సైనిక్ స్కూల్స్ సొసైటీ కి అనుబంధం గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమైంది. ఆ విధంగా అనుబంధాన్ని నెలకొల్పుకొనే సైనిక్ స్కూళ్ళ కు ప్రోత్సాహకం గా పాక్షికమైనటువంటి ఆర్థిక మద్ధతు ను అందించడం జరుగుతుంది.
బాలల ను నేశనల్ డిఫెన్స్ అకాడమీ లో అడుగుపెట్టడానికి విద్య పరంగాను, మానసిక పరిణతి పరంగాను సన్నద్ధులను చేయడం తో పాటు వారిని మంచి పౌరులు గాను, దేశానికి పనికి వచ్చే పౌరులుగాను ఎదిగేలా వారి శరీరాల ను, మనస్సులను, గుణగణాల ను తీర్చిదిద్దాలన్నదే స్కూళ్ళ ను ఏర్పాటు చేయడం లోని ఉద్దేశ్యం గా ఉంది.
ప్రస్తుతం దేశవ్యాప్తం గా 33 సైనిక్ స్కూళ్ళు నడుస్తున్నాయి. 2021-22 విద్య సంవత్సరం నుంచి ఈ 33 సైనిక్ స్కూళ్ళ లోనూ 6వ తరగతి ప్రవేశాలకు బాలికలు కూడా అర్హత ను పొందుతారు.
***
(Release ID: 1694492)
Visitor Counter : 186