ఆర్థిక మంత్రిత్వ శాఖ
వ్యూహాత్మక పెట్టుబడుల విధానం ప్రకటన ; వ్యూహాత్మక మరియు వ్యూహాత్మకేతర ప్రాంతాల కొరకు స్పష్టమైన రోడ్మ్యాప్
బిపిసిఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ బ్యాంక్, బిఇఎమ్ఎల్, పవన్ హన్స్, నీలాచల్ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ మొదలైనవాటి వ్యూహాత్మక పెట్టుబడులు 2021-22 ఆర్థికసంవత్సరంలో పూర్తి చేయబడతాయి
2021-22 సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ఒక సాధారణ బీమాసంస్థ కూడా ప్రైవేటీకరించబడతాయి
అవసరమైన సవరణల ద్వారా ఈ సెషన్‌లో ఎల్‌ఐసి యొక్క ఐపిఓతీసుకురాబడుతుంది
పెట్టుబడులు పెట్టడం నుండి రూ .1,75,000 కోట్లు అంచనా: ఆర్థిక మంత్రి
తమ ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులపై రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుంది
వ్యర్థ భూమి నుండి లబ్ది పొందటానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేయాలని ప్రతిపాదన
Posted On:
01 FEB 2021 1:53PM by PIB Hyderabad
పెట్టుబడుల ఉపసంహరణ - వ్యూహాత్మక విక్రయం
కోవిడ్-19 పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యూహాత్మక విక్రయాలపై ప్రభుత్వం తన కృషిని కొనసాగిస్తూనే ఉంది. ఈ మేరకు ‘బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవనహన్స్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్’ తదితర సంస్థల విక్రయం 2021-22నాటికి పూర్తికాగలదని ఆర్థికశాఖ మంత్రి చెప్పారు. ఇక ఐడీబీఐ బ్యాంకు కాకుండా 2021-22లో మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా ప్రైవేటీకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిపారు.
మరోవైపు జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో వాటా విక్రయంపై ‘ఐపీఓ’ను కూడా 2021-22లో ప్రభుత్వం అమలు చేస్తుందని, దీనికి సంబంధించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే తగు సవరణలు తెస్తామని ప్రకటించారు.
ఇవే కాకుండా ఆర్థికశాఖ మంత్రి అత్యంత ముఖ్యమైన ప్రకటన ఒకటి చేశారు. ఈ మేరకు ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ విధానం తీసుకొస్తామని, ఇందుకు ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపిందని వెల్లడించారు. వ్యూహాత్మక/వ్యూహాత్మకేతర రంగాల్లనూ పెట్టుబడుల ఉపసంహరణకు ఈ విధానం విస్పష్ట మార్గ ప్రణాళికను నిర్దేశిస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా వ్యూహాత్మకమైన నాలుగు రంగాల్లో కనీస సంఖ్యలో మాత్రమే ప్రభుత్వరంగ సంస్థలను నిర్వహిస్తూ, మిగిలినవిసహా వ్యూహాత్మేకతర సంస్థలను ప్రైవేటీకరించాలని లేదా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ విధానం అమలును వేగిరపరచడంలో భాగంగా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల తదుపరి జాబితా రూపకల్పనకు నీతి ఆయోగ్ ఉపక్రమిస్తుందని ఆమె వివరించారు. మొత్తంమీద 2020-21 బడ్జెట్ అంచనాల (బీఈ) మేరకు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,75,000 కోట్లు రాబట్టగలమని ప్రభుత్వం లెక్కలు వేసింది.
****
(Release ID: 1694203)
Visitor Counter : 448