ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఉష్ణ మండల వ్యాధుల (ఎన్‌టిడి) నివారణకు ప్రపంచదేశాల ఐక్యత

ఎన్‌టిడి దినోత్సవంగా జనవరి 30

భారత్ సంఘీభావం

ప్రపంచవ్యాపిత పురావస్తు స్మారక చిహ్నాలతో పాటు కాంతులీలనున్న కుతుబ్ మినార్

Posted On: 28 JAN 2021 7:47PM by PIB Hyderabad

ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన ఉష్ణ మండల వ్యాధుల (ఎన్‌టిడి) నివారణకు ప్రపంచ దేశాలు ఏకమయ్యాయి. ఎన్‌టిడి నివారణకు అన్ని దేశాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. ప్రపంచదేశాల ఐక్యతకు నిదర్శనంగా జనవరి 30వ తేదీన రెండవ (ఎన్‌టిడి) నివారణ వార్షికోత్సవాలను నిర్వహించనున్నారు. అట్టడుగు వర్గాలకు అంతులేని వ్యధను, ఆవేదనను ఎన్‌టిడి కలిగిస్తున్నాయి. దీనిని ఎదుర్కోవడానికి ప్రపంచదేశాలు కలసి ముందుకు సాగుతున్నాయి. వ్యాధుల నివారణలో సాధించిన ప్రగ్రతికి నిదర్శనంగా జనవరి 30వ తేదీన  ప్రపంచంలో 50కి పైగా స్మారక చిహ్నాలను దీపాలతో అలంకరించనున్నారు. భారతదేశంలో కుతుబ్ మినార్ ఇతర దేశాలలో వున్న పురావస్తు స్మారక చిహ్నాలతో పాటు దీపాల కాంతులను వెదజల్లనున్నది.కుతుబ్ మినార్ ను యునెస్కో ప్రపంచంలో వున్న పురావస్తు చిహ్నాలలో ఒకటిగా గుర్తించింది. 

ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఎన్‌టిడికి గురవుతున్నారు. నిర్లక్ష్యానికి గురైన ఉష్ణమండల వ్యాధులలో 11 వ్యాధుల ప్రభావం భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఎన్‌టిడి బారిన పడినవారు నీరసపడడంఅంగవైకల్యానికి గురవడం కొన్ని సందర్భాలలో ప్రాణాలను కోల్పోవడం జరుగుతూ వస్తోంది.  

 

***

 


(Release ID: 1693067) Visitor Counter : 192