ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
జనవరి 28,2021న రజతోత్సవాన్ని జరుపుకోనున్న ఎన్ ఐసిఎస్ ఐ; కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న రవిశంకర్ ప్రసాద
Posted On:
27 JAN 2021 1:16PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ ఐసి) కింద ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్ఫార్మిటిక్స్ సెంటర్ సర్వీసెస్ ఇన్ కార్పొరేటెడ్ (ఎన్ ఐసిఎస్ ఐ), 28 జనవరి 2021న తన 25వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్, లా అండ్ జస్టిస్ మంత్రి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఐటివై కార్యదర్శి అజయ్ సాహ్నే, ఎంఐఇటివై అదనపు కార్యదర్శి, ఎన్ ఐసిఎస్ ఐ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర కుమార్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ ఐసి) డిజి డాక్టర్ నీతా వర్మ, టెక్ మహీంద్ర ఇండియా సిఇఒ సి.పి. గుర్బానీ, నాస్కాం అధ్యక్షుడు ఎం.సి.దేబ్‌జానీ ఘోష్, ఎన్ ఐసిఎస్ ఐ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ మిట్టల్ ఈ రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
విధాన నిర్ణయాలలకు అర్థవంతమైన సమాచారాన్ని, ప్రభుత్వ సేవలు, పౌర పంపిణీలో సమర్థతను మెరుగురచడం, ఇ-ఆక్షన్ ఇండియా, - ప్రభుత్వ ఎలక్ట్రానిక్ ఫార్వార్డ్, రివర్స్ ఆక్షన్ అవసరాలను తీర్చడానికి, 24x7 ఆన్‌లైన్‌లో పని చేసే వ్యవస్థల అవసరాలను తీర్చేందుకు కీలక సమాచారాన్ని ఇచ్చే వర్చువల్ ఇంటెలిజెన్స్ పరికరం - తేజస్ ను మంత్రి ప్రారంభించనున్నారు. ఎక్కడ నుంచైనా పని చేసే అవకాశమున్న పోర్టల్ - వర్చువల్ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ మహమ్మారి కాలంలో సామాజిక దూరం, పని హామీ ఇస్తూ భద్రతను కల్పించే ఇఆఫీస్/ విసి ద్వారా ఉద్యోగులు అప్లికేషన్లను అందుబాటులోకి తెచ్చుకోవడానికి, డిజిటల్ ఇండియా బ్రాండింగ్ ను అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తి చేసిన సాఫ్ట్ వేర్‌ను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ ప్రతిపాదనలు చేసేందుకు కూడా ఈ తేజస్‌ను తోడ్పడుతుంది.
ఈ కార్యక్రమం 28 జనవరి 2021న ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఎన్ ఐసి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం (వెబ్‌కాస్ట్ లింక్ః //webcast.gov.in/nicsi) ద్వారా దీనిని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఎన్ ఐసిఎస్ ఐ తన ప్రయాణాన్ని ఐసిటి సేవా పరిశ్రమలో 29 ఆగస్ట్, 1995న ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు ఎండ్-టు-ఎండ్ ఐటి పరిష్కారాలను సంపాదించి, అందిస్తుంది. కొన్ని ప్రాజెక్టులలో ఎన్ ఐసిఎస్ ఐ అంతర్జాతీయ స్థాయిలో కూడా సేవలను అందిస్తుంది.
ప్రభుత్వ ఇ గవర్నమెంట్ మెజారిటీ ప్రాజెక్టులలో ఉనికి కలిగి, ఎన్ ఐసిఎస్ ఐ సామాజిక ఆర్థిక అభివృద్ధి మిషన్ దార్శనికతతో విజయవంతంగా మనుగడలో ఉంటూ పురోగమిస్తోంది.
ఎన్ ఐసిఎస్ ఐ కీలక సేవలలో ఐటి కన్సల్టెన్సీ, సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఫర్ డాటా అనలిటిక్స్, ప్రాడక్టైజేషన్ & అంతర్జాతీయ ప్రోత్సాహం, క్లౌడ్ సేవలు, ఐసిటి ఉత్పత్తి సంస్థాపన, మానవ వనరుల/ రోలౌట్/ శిక్షణ ప్రధానమైనవి. అది అందించే కీలక సేవలలో ఇఆఫీస్, ఇట్రాన్స్‌పోర్ట్, ఇహాస్పిటల్, ఇప్రిజన్స్, ఇకోర్ట్స్ తదితరాలు ఉన్నాయి.
***
(Release ID: 1692710)
Visitor Counter : 255