రాష్ట్రప‌తి స‌చివాల‌యం

72వ గ‌ణతంత్ర దినోత్స‌వ సంద‌ర్భంగా రేపు జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న భార‌త రాష్ట్రప‌తి

Posted On: 24 JAN 2021 6:45PM by PIB Hyderabad

భార‌త 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ సోమ‌వారం (జ‌న‌వ‌రి 25,2021)న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. 
ఆయ‌న సందేశాన్ని సాయంత్రం 7.00 గంట‌ల‌కు మొత్తం ఆలిండియా రేడియో జాతీయ నెట్‌వ‌ర్క్‌, దూర‌ద‌ర్శ‌న్లో తొలుత‌త హిందీలో త‌ర్వాత ఆంగ్లంలో ప్ర‌సారం చేయ‌నున్నారు. దూర‌ద‌ర్శ‌న్‌లో హిందీ, ఆంగ్ల భాష‌ల‌లో సందేశాన్ని ప్ర‌సారం చేసిన అనంత‌రం ప్రాంతీయ దూర‌ద‌ర్శ‌న్ ఛానెళ్ళు ఆయా భాష‌ల్లో ప్ర‌సారం చేస్తాయి. ఆలిండియా రేడియో ప్రాంతీయ భాష‌ల‌లో ఈ సందేశాన్ని త‌మ త‌మ ప్రాంతీయ నెట్‌వ‌ర్క్‌ల‌పై రాత్రి 8.30 గంట‌ల‌కు అందించ‌నున్నాయి. 

***
 


(Release ID: 1692018) Visitor Counter : 94