యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

శిక్షణా స్థావరానికి తిరిగి వచ్చే అథ్లెట్ల శిక్షణకు ఆటంకం కలగకుండా ఉండటానికి సాయ్‌ చురుకైన చర్యలు తీసుకుంటోంది

Posted On: 23 JAN 2021 7:23PM by PIB Hyderabad

ఒలింపిక్ గేమ్స్ బౌండ్ అథ్లెట్ల శిక్షణకు ఆటంకం కలగకుండా ఉండటానికి వివిధ పోటీల నుండి కేంద్రాలకు తిరిగి వచ్చేవారికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా క్వారంటైన్ నిబంధనలను సవరించింది.

సెప్టెంబర్ 11 మరియు డిసెంబర్ 3, 2020 న జారీ చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల పాక్షిక సవరణలో  జాతీయ శిబిరాలకు తిరిగి వచ్చే క్రీడాకారులు మరియు సాయ్‌ శిక్షణా కేంద్రాలలో ఇతర శిక్షణల భద్రత విషయంలో రాజీ పడకుండా శిక్షణను కొనసాగించగలవని సాయ్‌ నిర్ధారించింది. అథ్లెట్లు తమ శిక్షణా కార్యక్రమాలను కొనసాగించగలిగేలా ఈ చర్యను ప్రవేశపెట్టినట్లు సాయ్‌  ఒక ప్రకటనలో తెలిపింది. క్రీడాకారులు తన శిక్షణా దినచర్యను తిరిగి ప్రారంభించగలుగుతారు. అయితే క్రీడాకారులు వారి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ఫలితాలు వచ్చేవరకూ మొదటి ఇతర ఆటగాళ్లకు దూరంగా ఏడు రోజులు బయోబబుల్‌ లో ఉంటారు.

టోక్యో ఒలింపిక్ క్రీడలకు ఆరు నెలలు మిగిలి ఉండటంతో దేశీయ మరియు అంతర్జాతీయ పోటీలు పునఃప్రారంభమవుతున్నాయి. దీంతో అథ్లెట్లు ఒలింపిక్ క్రీడలకు అర్హత పొందడానికి లేదా పోటీ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి వివిధ విభాగాలలో పోటీపడటం ప్రారంభిస్తారు. అయితే వారు పోటీ నుండి తిరిగి వచ్చిన ప్రతిసారీ ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండమని చెప్పడం వారి శిక్షణా కార్యక్రమంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

వివిధ పోటీల నుండి తిరిగి వచ్చిన అథ్లెట్లను ఏడు రోజుల పాటు ప్రత్యేక హాస్టల్ సముదాయం లేదా హాస్టల్స్‌లో ఉంచాలని ఆయా శిక్షాణా కేంద్రాల అధిపతులకు సాయ్ తెలిపింది. వారి ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగిటివ్ ఫలితం వచ్చేవరకూ బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లతో వారు కలవకూడదని చెప్పింది.

అన్ని సాయ్‌ కేంద్రాల అధిపతులు మరియు కోచ్‌లు సరైన షెడ్యూల్‌ను రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. తద్వారా పోటీ నుండి తిరిగి వచ్చే క్రీడాకారులు ఆట, వ్యాయామం మరియు స్పోర్ట్స్ సైన్స్ సదుపాయాలను శిక్షణ యొక్క కొనసాగింపును నిర్ధారించడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలో  సంబంధిత కేంద్రాలలో ఉన్న ఆ అథ్లెట్ల భద్రతలో  రాజీ పడకూడదు.

అదేవిధంగా, పోటీల నుండి తిరిగి వచ్చే అథ్లెట్లకు వారి ఆర్టీ-పిసిఆర్ పరీక్ష నివేదిక అందుబాటులోకి వచ్చే వరకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేయాలని అన్ని కేంద్రాలకు సూచించారు. ప్రత్యేక భోజన ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాని ప్రదేశాలలో  శిబిరంలో  ఉండిపోయిన వారితో అలాంటి వ్యక్తులు కలవడాన్ని నివారించడానికి వారు ఒక వివరణాత్మక షెడ్యూల్ రూపొందిస్తారు.


 

*******


(Release ID: 1691700) Visitor Counter : 110