మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

దేశంలో ఏవియన్ ఇన్‌ఫ్లూయాంజా ప‌రిస్థితి

Posted On: 22 JAN 2021 4:21PM by PIB Hyderabad

దేశంలో శుక్ర‌వారం నాటికి (22వ తేదీ జనవరి) తొమ్మిది రాష్ట్రాలలోని (కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గ‌ఢ్‌, ఉత్తరా ఖండ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్) పౌల్ట్రీ పక్షులలో ఏవియన్ ఇన్‌ఫ్లూయాంజా నిర్ధార‌ణ అయింది.  
దీనికి తోడు ప‌న్నెండు రాష్ట్రాలలో కాకి/ వలస/ అడవి పక్షులలోనూ ఏవియన్ ఇన్‌ఫ్లూయాంజా (బర్డ్ ఫ్లూ) వ్యాప్తి నిర్ధారించబడింది.  ఈ జాబితాలో హర్యానా, మ‌ధ్య ‌ప్ర‌దేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గ‌ఢ్ , హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, మ‌రియు  పంజాబ్ రాష్ట్రాలున్నాయి. ఉత్తరాఖండ్ లోని అల్మోరా (ఆర్‌.కె.పుర‌, హవల్బాగ్) జిల్లా,
గుజరాత్ లోని సోమనాథ్ (డోలాసా, కోడినార్) జిల్లాల నుండి వచ్చిన పౌల్ట్రీ నమూనాలలో ఏవియన్ ఇన్‌ఫ్లూయాంజా నిర్ధారించబడింది. జమ్మూ & కాశ్మీర్ యుటి రాష్ట్రాల్లోని (కుల్గాం, అనంతనాగ్, బుడ్గామ్, పుల్వామా) కాకుల‌లోనూ, ఉత్తరాఖండ్ లోని తెహ్రీ శ్రేణిలోని కాలిజీ ఫెసాంట్ బర్డ్‌లో నిర్ధారించబడింది.
అయితే రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా నుండి సమర్పించిన కాకుల‌ నమూనాలో ఏవియన్ ఇన్‌ఫ్లూయాంజా ప‌రీక్ష‌ల్లో నెగటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్టు నిర్ధార‌ణ‌యింది.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, కేరళ ప్రభావిత కేంద్రాలలో నియంత్రణ  కార్యకలాపాలు(శుభ్రపరచడం మరియు క్రిమిసంహారకాలు జ‌ల్ల‌డం) వంటి వివిధ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. ఏవియన్ ఇన్‌ఫ్లూయాంజా 2021 నియంత్రణకు సవరించి త‌యారు చేసిన‌ కార్యాచరణ ప్రణాళిక ప్ర‌కారం ప్రతిరోజు  రాష్ట్రాలు / యుటీలు డిపార్ట్‌మెంట్‌కు వివ‌రాల‌ను అందిస్తున్నాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్ హ్యాండిల్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో సహా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఏవియన్ గురించి అవగాహన కల్పించడానికి డిపార్ట్‌మెంట్ నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తోంది.
ఏపీఎస్ /ఎంజీ


 

********



(Release ID: 1691505) Visitor Counter : 129