రైల్వే మంత్రిత్వ శాఖ
వందే భారత్ రకం ట్రెయిన్ సెట్లకు టెండర్ ఖరారు చేసిన భారతీయ రైల్వేలు
16 కార్లకు ఒక్కొక్కదానికి 44 రేక్‌ల చొప్పున అందించేందుకు టెండర్. భారతీయ రైల్వేలకు చెందిన మూడు ఉత్పత్తి కేంద్రాలలో ఈ రేక్‌లు తయారవుతాయి
మొత్తం విలువలో కనీసం 75% స్థానిక వస్తువు అవసరమన్న షరతు తొలిసారి ఈ టెండర్‌లో ప్రవేశపెట్టారు
మేకిన్ ఇండియా మిషన్‌కు ప్రోత్సాహం
టెండర్‌ను దేశీయ ఉత్పత్తిదారు ఎం/ఎస‌్ మేథా సెర్వో డ్రైవ్స్ లిమిటెడ్‌కు అప్పగింత
Posted On:
22 JAN 2021 2:33PM by PIB Hyderabad
ఐజిబిటి ఆధారిత 3-దశ చోదనం, నియంత్రణ, రైళ్ళకు (వందే భారత్ రకం ట్రైన్ సెట్లకు) ప్రతి 16 కోచ్ లకు 44 కోలలు (Rakes) అవసరమైన రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరా, విలీనీకరణ, పరీక్ష, కమిషనింగ్ కు భారతీయ రైల్వే 21.01.2021న టెండర్‌ను ఖరారు చేసింది.
సేకరణలో సరఫరాదారుతో 5 ఏళ్ళ సమగ్ర వార్షిక నిర్వహణ కాంట్రాక్టు ఇమిడి ఉంటుంది.
దేశీయంగా ట్రైన్ సెట్లను ఉత్పత్తి చేసేందుకు వివిధ స్థాయిల్లో పరిశ్రమలతో బహుళ చర్చలు నిర్వహించిన తర్వాత నిర్దిష్ట ప్రమాణాలు, కొలతలను తయారు చేశారు. తొలిసారి, మొత్తం టెండర్ విలువలో కనీసం 75% స్థానిక వస్తువుల అవసరమని పేర్కొనడం జరిగింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ టెండర్‌లో ముగ్గురు బిడ్డర్లు పాల్గొన్నారు. ఇందులో అతి తక్కువ ఆఫర్ దేశీయ ఉత్పత్తిదారు అయిన ఎం/ఎస‌్ మేథా సెర్వో డ్రైవ్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. మొత్తం విలువలో కనీసం 75% స్థానిక వస్తు వినియోగం ఉండాలన్న షరతును ఈ సంస్థ విజయవంతంగా నెరవేర్చింది. టెండర్‌ను మేథా సెర్వో డ్రైవ్స్ లిమిటెడ్‌కు 16 కోచ్‌లు కలిగిన రైలులో ఒక్కొక్కదానికీ 44 రేకుల చొప్పున రూ. 2211,64,59, 644 (రెండువేల రెండువందల పదకొండు కోట్ల, అరవై నాలుగు లక్షల, యాభై తొమ్మిది వేల, ఆరువందల నలభైనాలుగు రూపాయిలు) వ్యయంతో ఖరీరు చేశారు. వీటిని భారతీయ రైల్వేలకు చెందిన మూడు ఉత్పాదక యూనిట్లలో తయారు చేశారు. ఐసిఎఫ్‌లో 24 రేక్‌లు, ఆర్‌సిఎఫ్‌లో 10, మిగిలిన 10 ఎంసిఎఫ్‌లో ఉత్పత్తి చేయనున్నారు.
ఈ రేక్‌ల బట్వాడా షెడ్యూలు - తొలి 2 రేక్ నమూనాలు 20 నెలల్లో అప్పగించాలి, వాటిని విజయవంతంగా ఆరంభించిన తర్వాత, నాలుగు నెలలకు (క్వార్టర్) 6 రేక్‌ల చొప్పున బట్వాడా చేస్తుంది.
***
(Release ID: 1691277)
Visitor Counter : 151