సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

125వ జయంతి వేడుకలకు గుర్తుగా నేతాజీ సుభాస్ చంద్రబోస్‌ పై చిత్రాలను ప్రసారం చేయనున్న ఫిల్మ్స్ డివిజన్

प्रविष्टि तिथि: 22 JAN 2021 1:00PM by PIB Hyderabad

జనవరి 23,2021 న నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరియు అతని జీవితంపై రెండు డాక్యుమెంటరీ చిత్రాలను ప్రదర్శించడం ద్వారా  ఫిల్మ్స్‌ డివిజన్ పరాక్రం దివాస్‌ను జరుపుకుంటుంది. నేతాజీ సుభాస్ చంద్రబోస్ దేశానికి చేసిన నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఆయన పుట్టినరోజు అయిన జనవరి 23 ను భారత ప్రభుత్వం పరాక్రం దివాస్‌గా ప్రకటించింది.


 



బ్రిటిష్‌ పాలకుల నుండి విముక్తి కోసం  పొరాడిన గొప్ప నాయకుడి జీవితంపై రూపొందించిన రెండు డాక్యుమెంటరీలు "ది ఫ్లేమ్ బర్న్స్ బ్రైట్" ( 43 నిమిషాలు/ ఇంగ్లీష్ / 1973/ ఆశిష్‌ ముఖర్జీ) మరియు "నేతాజీ" (21 నిమిషాలు/హిందీ/1973/అరుణ్ చందూరి) జనవరి 23,2021 న ఫిల్మ్స్ డివిజన్ వెబ్‌సైట్ మరియు యు ట్యూబ్ ఛానెల్‌లో రోజంతా ప్రసారం చేయబడతాయి.



దయచేసి https://filmsdivision.org/ని సందర్శించి @ “Documentary of the Week” క్లిక్ చేయండి లేదా చిత్రాలను  ఆస్వాదించడానికి https://www.youtube.com/user/FilmsDivisionను సందర్శించండి.

***


(रिलीज़ आईडी: 1691275) आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , हिन्दी , Tamil