భారత పోటీ ప్రోత్సాహక సంఘం
మాక్స్ లైఫ్ ఇన్సూరెన్్స కంపెనీ లిమిటెడ్‌లో వాటాలు కొనుగోలుకు యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, యాక్సిస్ కాపిటల్ లిమిటెడ్, యాక్సిస్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌కు ఆమోదాన్ని తెలిపిన సిసిఐ
Posted On:
21 JAN 2021 11:09AM by PIB Hyderabad
మాక్స్ లైఫ్ ఇన్సూరెన్్స కంపెనీ లిమిటెడ్‌లో వాటాలు కొనుగోలుకు యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, యాక్సిస్ కాపిటల్ లిమిటెడ్, యాక్సిస్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదాన్ని తెలిపింది.
యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ రిటైల్ రుణాలు, రిటైల్ డిపాజిట్లు, టోకు బ్యాంకింగ్, చెల్లింపు పరిష్కారాలు, సంపద నిర్వహణ, ఫోరెక్స్ డబ్బు పంపడం, అందుకోవడం, మ్యూచ్చువల్ ఫండ్ పథకాల పంపిణీ, బీమా విధానాల పంపిణీ సహా అనేక సేవలను యాక్సిస్ బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది.
ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్, సంస్థాగత ఈక్విటీల రంగంలో అనుకూల పరిష్కారాలను అందించడంపై దృష్టి పెట్టే వ్యాపారంలో యాక్సిస్ కాపిటల్ లిమిటెడ్ నిమగ్నమై ఉంది.
యాక్సిస్ సెక్యూరిటీస్ లిమిటెడ్ బ్రోకింగ్ వ్యాపారం, ఆర్థిక ఉత్పత్తుల పంపిణీ, సలహా సేవలను అందిస్తుంది.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ)తో నమోదు చేసుకున్న జీవిత బీమా కంపెనీ - మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. జీవిత బీమా, యాన్యుటీ (ప్రతి ఏడాది చెల్లించే నిర్ణీత మొత్తం) ఉత్పత్తులు, భారత్‌లో పెట్టుబడి ప్రణాళికలలో ఈ కంపెనీ పని చేస్తోంది.
సిసిఐ ఆమోదించిన ప్రతిపాదిత కలయిక ప్రకారం మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (టార్గెట్)లో యాక్సిస్ బ్యాంక్ వాటాలను 9.9%కి పెంచడం, 2% కొనుగోలు, 1% వాటాలను టార్గెట్‌లో వాటాలను యాక్సిస్ కాపిటల్ లిమిటెడ్, యాక్సిస్ సెక్యూరిటీస్ లిమిటెడ్ దక్కించుకోవచ్చు.
ఈ మేరకు సిసిఐ జారీ చేయనున్న వివరణాత్మక ఉత్తర్వులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.
***
(Release ID: 1690842)
Visitor Counter : 113