భారత పోటీ ప్రోత్సాహక సంఘం

అల్టికో క్యాపిటల్ ఇండియా లిమిటెడ్‌ను అరెస్ ఎస్‌ఎస్‌జీ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (సింగపూర్) ప్రైవేట్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం

Posted On: 21 JAN 2021 11:08AM by PIB Hyderabad

అల్టికో క్యాపిటల్ ఇండియా లిమిటెడ్‌ (అల్టికో)ను అరెస్ ఎస్‌ఎస్‌జీ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (సింగపూర్) ప్రైవేట్‌ లిమిటెడ్‌ ‍(అరెస్‌ ఎస్‌ఎస్‌జీ) కొనుగోలు చేయడానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. పోటీ చట్టం-2002లోని సెక్షన్‌ 31(1) ప్రకారం ఆమోదం తెలిపింది.

    ప్రస్తుత ప్రతిపాదిత సమ్మేళనం, అరెస్‌ ఎస్‌ఎస్‌జీ గుర్తించిన ఇండియా స్పెషల్‌ సిట్యుయేషన్స్‌ స్కీమ్‌-II (ఐఎస్‌ఎస్‌ఎస్‌-II‌‌), ఇన్వెస్ట్‌మెంట్‌ ఆపర్చునిటీస్‌ వీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఐవోవీ),  అసెట్స్‌ కేర్‌ & రీకన్‌స్ట్రక్షన్‌ ఎంటర్‌ప్రైజ్‌ లిమిటెడ్‌ (ఏసీఆర్‌ఈ) ద్వారా అల్టికో రుణ ఆస్తులను దక్కించుకోవడానికి సంబంధించింది.

    ఐఎస్‌ఎస్‌ఎస్‌-II అనేది ఇండియా స్పెషల్‌ సిట్యుయేషన్స్‌ ట్రస్టు పథకం. ఇదొక ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్‌). సెబి (ఏఐఎఫ్‌) నిబంధనలు-2012 ప్రకారం నమోదైంది.

    సెబి (ఎఫ్‌పీఐ) నిబంధనలు-2019 ప్రకారం, ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్‌ (ఎఫ్‌పీఐ)గా ఐవోవీ నమోదైంది. కేటగిరీ-I ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ లైసెన్సును కలిగి ఉంది.

    ఏసీఆర్‌ఈ అనేది, "సెక్యూరిటైజేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ది ఫైనాన్సియల్‌ అసెట్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ ఇంటరెస్ట్‌ యాక్ట్‌"-2002 నిబంధనల కింద, ఆర్‌బీఐ వద్ద నమోదైన ఆస్తుల పునరుద్ధరణ సంస్థ (ఏఆర్‌సీ). ఆస్తుల పునర్నిర్మాణం, సముపార్జన, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నిరర్ధక ఆర్థిక ఆస్తుల పునరుద్ధరణ కార్యకలాపాలను ఇది చేపడుతుంది.

    అరెస్‌ ఎస్‌ఎస్‌జీ గ్రూపును 2009లో స్థాపించారు. ఇది, ప్రత్యామ్నాయ ఆస్తుల నిర్వహణ సంస్థ. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో పెట్టుబడులు దీని లక్ష్యం. రుణ ఆస్తుల నిర్వహణలో, ఆసియాలోని ప్రముఖ సంస్థల్లో ఇది ఒకటి.

    అల్టికో ఒక ఎన్‌బీఎఫ్‌సీ. దేశంలోని స్థిరాస్తి రంగంలో, చిన్న, మధ్యతరహా సంస్థలకు ఇది రుణాలు ఇస్తుంది.

    ఈ కొనుగోలుకు సంబంధించి సీసీఐ పూర్తి ఆదేశం రావాల్సివుంది.

***


(Release ID: 1690833) Visitor Counter : 146