ప్రధాన మంత్రి కార్యాలయం

జనవరి 22వ తేదీన తేజ్ ‌పూర్ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవంలో ప్రసంగించనున్న - ప్రధానమంత్రి

Posted On: 20 JAN 2021 6:11PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 జనవరి, 22వ తేదీ, ఉదయం 10 గంటల 30 నిముషాలకు, అస్సాంలోని తేజ్ ‌పూర్ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి, దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.  ఈ కార్యక్రమంలో - అస్సాం గవర్నర్ ప్రొఫెసర్ జగదీష్ ముఖి; కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’; అస్సాం ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ కూడా పాల్గొంటారు.

ఈ సందర్భంగా 2020 లో ఉత్తీర్ణులైన 1218 మంది విద్యార్థులకు డిగ్రీలు, డిప్లొమాలు ప్రదానం చేస్తారు.  వీరిలో, అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 48 మందికి, స్వర్ణ పతకాలు ప్రదానం చేస్తారు. 

కోవిడ్ -19 నియమ,నిబంధనలకు అనుగుణంగా, ఈ స్నాతకోత్సవాన్ని, మిశ్రమ పద్దతిలో జరుగుతుంది. అందువల్ల, పి.హెచ్.‌డి. పూర్తి చేసిన అభ్యర్థులు, స్వర్ణ పతక విజేతలు మాత్రమే, వారి డిగ్రీలు, స్వర్ణ పతకాలను వ్యక్తిగతంగా స్వీకరిస్తారు. కాగా, మిగిలిన గ్రహీతలకు, వారి డిగ్రీలు, డిప్లొమాలు, దృశ్యమాధ్యమం ద్వారా ప్రదానం చేస్తారు.

 

****



(Release ID: 1690609) Visitor Counter : 158