కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
నవంబర్ 2020 పేరోల్ డేటాలో ఈపీఎఫ్‌ఓలో కొత్తగా 10.11 లక్షల నికర చందాదారులు చేరారు
Posted On:
20 JAN 2021 5:17PM by PIB Hyderabad
ఈ రోజు విడుదల చేసిన ఈపీఎఫ్‌ఓ తాత్కాలిక పేరోల్ 2020 నవంబర్ నెలలో సుమారు 10.11 లక్షల నికర చందాదారులు చేరారని వెల్లడించింది. కోవిడ్ -19 మహమ్మారి ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుండి నవంబర్, 2020) 45.29 లక్షల నికర చందాదారులు ఈపీఎఫ్‌ఓలో చేరారు. ప్రచురించిన డేటాలో నెలలో చేరిన సభ్యులు మరియు వారి సహకారం అందుకున్న సభ్యులు ఉంటారు.
2020 నవంబర్ నెలలో సుమారు 6.41 లక్షల మంది కొత్త సభ్యులు ఈపీఎఫ్‌ఓలో చేరారు. సుమారు 3.70 లక్షల మంది సభ్యులు నిష్క్రమించి తిరిగి ఈపీఎఫ్‌ఓలో చేరారు. ఈ సంఖ్య ఈపీఎఫ్‌ఓ పరిధిలో ఉన్న సంస్థలలోని చందాదారులు ఉద్యోగాలు మారడాన్ని సూచిస్తుంది. చందాదారులు తుది పరిష్కారం కోసం కాకుండా నిధుల బదిలీ ద్వారా తమ సభ్యత్వాన్ని నిలుపుకునే ఆప్షన్‌ను ఎంచుకున్నారు. భారతదేశంలో కోవిడ్ -19 కేసుల క్షీణతతో కార్మికులు తమ ఉద్యోగాలకు తిరిగి వస్తున్నారని తిరిగి చేరిన నిష్క్రమణ సభ్యులు సూచిస్తున్నారు.
వయస్సుల వారీ విశ్లేషణ ప్రకారం.. నవంబర్ 2020 లో 22-25 వయస్సు చందాదారుల సంఖ్యలో అత్యధికంగా 2.72 లక్షల నికర సంఖ్యను నమోదు చేసింది. దీని తరువాత 18-21 వయస్సుగల వారిలో 2.21 లక్షల నికర నమోదు ఉంది. ఇక 18-25 వయస్సు గల సభ్యులను కార్మిక మార్కెట్లో తాజా చేరికలుగా పరిగణించవచ్చు. 2020 నవంబర్‌లో కొత్త చందాదారుల చేరికలలో ఇది సుమారు 48.72% గా ఉంది.
పేరోల్ గణాంకాల జాబితాలో మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలు ఉపాధి రికవరీలో ముందంజలో కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2020-21 (ఏప్రిల్ నుండి నవంబర్, 2020 వరకు) మొత్తం నికర పేరోల్ చేరికలో అన్ని వయస్సుల్లో కలిపి సుమారు 53% జోడించాయి.
పరిశ్రమల వారీ విశ్లేషణ ‘నిపుణుల సేవలు’ వర్గాన్ని సూచిస్తుంది (ఇందులో ప్రధానంగా మానవ వనరుల ఏజెన్సీలు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు మరియు చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని వయసుల వారికి 23.45 లక్షల మొత్తం పేరోల్‌ను అందించడం ద్వారా జాబితాలో ఈ విభాగం ప్రథమ స్థానంలో ఉంది. ఇదే కాలానికి మొదటి పది పరిశ్రమ వర్గాల నికర కొత్త పేరోల్‌లో ఇది సుమారు 60% గా ఉంది. ఇతర పరిశ్రమ వర్గీకరణలో భవన నిర్మాణ పరిశ్రమ, ఇంజనీర్లు-ఇంజనీరింగ్ కాంట్రాక్టర్లు, ఎలక్ట్రికల్, మెకానికల్ లేదా జనరల్ ఇంజనీరింగ్ ఉత్పత్తులు రికవరీ ఇతర రంగాలలో కూడా ప్రారంభమయ్యాయని సూచిస్తుంది.
2020 నవంబర్ నెలలో లింగాల వారీ విశ్లేషణలో కొత్త నమోదులో మహిళల వాటా 2020 అక్టోబర్‌లో 21.64% నుండి 2020 నవంబర్‌లో 22.40 శాతానికి పెరిగిందని తెలుస్తుంది. మొత్తం 6.41 లక్షల నికర చందాదారులు ఈ నెలలో ఈపీఎఫ్ పథకంలో చేరారు. నవంబర్ 2020 లో మొత్తం 1.43 లక్షలు మహిళా ఉద్యోగులు ఉన్నారు.
సార్వత్రిక కవరేజీని విస్తరించడం మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తన వాటాదారులకు నిరంతరాయంగా సేవలను అందించడం లక్ష్యంగా ఈపీఎఫ్‌ఓ పనిచేస్తోంది. సామాజిక భద్రతా సంస్థగా ఈపీఎఫ్‌ఓ తన సేవలను విస్తరిస్తోంది. ఉద్యోగుల రికార్డులను నవీకరించడం నిరంతర ప్రక్రియ కాబట్టి పేరోల్ డేటా తాత్కాలికం మరియు తదనుగుణంగా నెలవారీ ప్రాతిపదికన నవీకరించబడుతుంది.
****
(Release ID: 1690607)
Visitor Counter : 134