ఆర్థిక మంత్రిత్వ శాఖ
రూ. 82.23 కోట్ల నకలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను పొందినందుకు ఒకరిని అదుపులోకి తీసుకున్న సిజిఎస్టీ ఢిల్లీ ఈస్ట్ అధికారులు
నాడు పోస్టు చేయడమైనది:
18 JAN 2021 2:53PM by PIB Hyderabad
అనర్హమైన ఐటిసి ఉపయోగానికి వ్యతిరేకంగా జరుగుతున్నదాడుల్లో భాగంగా, కేంద్ర గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (సిజిఎస్‌టి) కమిషనరేట్, ఢిల్లీ నకిలీ ఐటిసిని ఉత్పత్తి చేసి, సరఫరా చేసే బహుళ స్థర నెట్‌వర్క్ కలిగిన నకిలీ సంస్థలను కనుగొన్నారు.
విస్త్రత డాటా అనలిటిక్స్‌ను ఉపయోగించడం ద్వారా అధికారులు 21 సంస్థలను గుర్తించి, 15/01/2021 నుంచి 17/01/2021 మధ్య కాలంలో ఆయా ఆవరణలలో సోదాలు నిర్వహించిన క్రమంలో, 2017 నుంచి నకిలీ ఐటిసీని పొందేందుకు పని చేస్తున్న నకిలీ సంస్థల నెట్‌వర్క్ ను బహిర్గతం చేశారు.
ఈ నకిలీ సంస్థల నెట్‌వర్క్‌ను అర్వింద్ కుమార్ అనే వ్యక్తి నిర్వహిస్తూ, నకిలీ ఐటిసిని ఇచ్చేందుకు ఇన్‌వాయిస్ మొత్తంలో 4 నుంచి 4.5% న్ని కమిషన్‌గా పొందుతున్నాడు. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తులో, 46 సంస్థలు నిజమైనవి కావని, వీటిని అర్వింద్ కుమార్ ఆయన సహచరులు నియంత్రిస్తున్నారని బయిటపడింది. ఈ సంస్థలకు ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు లేవు, నకిలీ ఐటిసిని జారీ చేయాలన్న ఏకైక ఉద్దేశంతో సృష్టించినవి. ఈ నకిలీ ఐటిసి మొత్తాన్ని పరిమాణీకరించగా, రూ. 541.13 కోట్ల రూపాయలకు ఇంతవరకూ రూ. 82.243 కోట్ల రూపాయలను పొందినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ దర్యాప్తు పురోగమిస్తున్న క్రమంలో ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది.
అధికారులు సిజిఎస్‌టి చట్టం, 2017లోని సెక్షన్ 69(1) కింద అర్వింద్ కుమార్‌ను అరెస్టు చేసి, 17/01/2021న డ్యూటీ మెజిస్ట్రేటు ఎదుట హాజరుపరచగా, ఆయనను 31/01/2021వరకు అంటే14 రోజుల వరకూ జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
కాగా, రూ. 3766.69 కోట్లకన్నా ఎక్కువ మొత్తంలో జీఎస్టీని ఎగవేసిన పలు కేసులకు సంబంధించి జిఎస్టీ సెంట్రల్ టాక్స్, ఢిల్లీ జోన్ ఏర్పాటు అయినప్పటి నుంచి 19 అరెస్టులు నిర్వహించింది.
***
(రిలీజ్ ఐడి: 1689752)
సందర్శకుల సూచీ సంఖ్య : : 175