మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
దేశంలో ఏవియన్ ఇన్ఫ్లూయింజా యొక్క స్థితి
Posted On:
17 JAN 2021 5:56PM by PIB Hyderabad
జనవరి 17 2021 వరకు పౌల్ట్రీలో ఏవియన్ ఇన్ఫ్లూయింజా కేసులు మండ్సౌర్ జిల్లాలోని సెంట్రల్ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (సిపిడిఓ (డబ్ల్యుఆర్), మహారాష్ట్ర ముంబై, మరియు ఖేడా రోడ్ వద్ద పౌల్ట్రీలో నిర్ధారించబడ్డాయి.
ఇంకా ఏవియన్ ఇన్ఫ్లూయింజా కేసులు పన్నా, సాంచి, రైసన్, బాలాఘాట్, మరియు మధ్యప్రదేశ్ లోని షియోపూర్ (కాకి, గుడ్లగూబ) మరియు మాండ్సౌర్ (స్వాన్, పావురం) జిల్లాల పక్షులలో నిర్ధారించబడింది; ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ (కాకి, పావురం) మరియు దంతేవాడ (కాకి) జిల్లాలు కేసులు ఉన్నాయి; ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ మరియు లాన్స్ డౌన్ అటవీ శ్రేణిల్లోని కాకి నమూనాల్లో గుర్తించబడ్డాయి.
వీటితో పాటు ఢిల్లీలోని రోహినిలోని హెరాన్ నమూనాలో ఏవియన్ ఇన్ఫ్లూయింజా పాజిటివ్ నిర్ధారణ అయింది.
మహారాష్ట్రలో ఆర్‌ఆర్‌టిలను మోహరించారు. సిపిడిఓ, ముంబైతో సహా అన్ని ప్రభావిత కేంద్రాలలో పౌల్ట్రీ పక్షులను చంపడం జరుగుతోంది. ఇంకా, మధ్యప్రదేశ్‌లో ఆర్‌ఆర్‌టిలను మోహరించారు. హర్యానా కేంద్రంగా పౌల్ట్రీని తొలగించడం కొనసాగుతోంది.
నేడు, రాజస్థాన్ మరియు గుజరాత్ నుండి పరీక్షించిన నమూనాలు ఏఐ నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.
దేశంలోని ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన కేంద్ర బృందం బాధిత ప్రాంతాలను సందర్శించి ఎపిడెమియోలాజికల్ అధ్యయనాలు నిర్వహిస్తోంది.
వ్యాధి నిర్దారణ కాని ప్రాంతాల్లో పౌల్ట్రీ మరియు పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం విధించాలన్న నిర్ణయాలను పునరాలోచించాలని అలాగే ప్రభావితం కానీ ప్రాంతాలు/ రాష్ట్రాల నుండి లభించే అమ్మకాలను అనుమతించాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. బాగా వండిన కోడి మరియు గుడ్ల వినియోగం మానవులకు సురక్షితం. ఇంకా, వినియోగదారులు అశాస్త్రీయమైన మరియు గందరగోళానికి దారితీసే నిరాధారమైన పుకార్లను నమ్మవద్దు. వాటి కారణంగా ఇప్పటికే కోవిడ్ 19 పాండమిక్ లాక్డౌన్ ద్వారా ప్రభావితమైన పౌల్ట్రీ మరియు గుడ్డు మార్కెట్లను మాత్రమే కాకుండా పౌల్ట్రీ మరియు మొక్కజొన్న రైతులను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.
పక్షుల అసాధారణ మరణాలను నివేదించడానికి మహారాష్ట్ర పశుసంవర్ధక శాఖ రైతులకు టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. డిపార్ట్మెంటల్ అధికారులు మరియు సాధారణ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం సవరించిన ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కార్యాచరణ ప్రణాళిక 2021 కు అనుగుణంగా ఏవియన్ ఇన్ఫ్లుఎంజాపై అవసరమైన సమాచారాన్ని ఉంచారు. వ్యాధి యొక్క వ్యాప్తిని తనిఖీ చేయడానికి "ప్రభావిత ప్రాంతం" మొదలైన వాటికి సంబంధించి అవసరమైన నోటిఫికేషన్లు ఇప్పటికే రాష్ట్రంలో జారీ చేశారు.
బర్డ్ ఫ్లూ యొక్క సంఘటనలను వెంటనే తెలియజేసేందుకు, జంతువుల సంక్రమణ మరియు అంటు వ్యాధుల నివారణ మరియు నియంత్రణ చట్టం 2009 ప్రకారం ఇవ్వబడిన అధికారాల వినియోగం, రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు వారి స్థానిక అధికార పరిధిలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణ మరియు నిర్మూలన కోసం అవసరమైన అన్ని అధికారాలను అప్పగించింది.
సంబంధిత శాఖ సలహాలను అనుసరించి వార్తాపత్రిక ప్రకటనలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా రాష్ట్రాలు అవగాహన కల్పించే కార్యకలాపాలను చేపడుతున్నాయి. అలాగే, ఏవియన్ ఇన్ఫ్లుఎంజా గురించి అవగాహన కల్పించడానికి మరియు పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నిరంతర ప్రయత్నాలు వివిధ మీడియా వేదికలతో పాటు ట్విట్టర్ మరియు ఫేస్‌బుక్ హ్యాండిల్స్ వంటి సోషల్ మీడియా వేదికగా సాధారణ ప్రజలలో పంచుకుంటున్నాయి.
***
(Release ID: 1689577)
Visitor Counter : 190