సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కేవలం ఆల్కహాల్ వేడుకగా ప్రారంభమైన ఈ వేడుక తదుపరి జీవిత వేడుకగా మారింది : డైరెక్టర్
గోవాలోని కళా అకాడమీలో డెన్మార్క్ కు చెందిన చిత్ర నిర్మాత థామస్ వింటర్ బర్గ్ చిత్రం “అనదర్ రౌండ్” ప్రదర్శనతో 51వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) ప్రారంభమయింది. అలాగే ఈ ప్రారంభ చిత్రం 93వ ఆస్కార్ అవార్డుల బరిలోకి డెన్మార్క్ అధికారికంగా ప్రవేశించడానికి గుర్తుగా ప్రదర్శించిన ఇండియన్ ప్రీమియర్ చిత్రం.
డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఉదయం వేళ 51వ ఐఎఫ్ఎఫ్ఐ ప్రారంభ కార్యక్రమంలో ప్రారంభ చిత్రం ట్రయలర్ ప్రదర్శించారు. “కేవలం ఒక ఆల్కహాల్ వేడుకగా ప్రారంభమైన ఈ ఉత్సవం తదుపరి జీవిత వేడుకగా మారింది” అని చిత్ర ప్రదర్శన సందర్భంగా వింటర్ బర్గ్ పంపిన వీడియో సందేశంలో తెలిపారు.
కేన్స్ ఉత్తమ నటుడు బహుమతి గ్రహీత మాడ్స్ మికెల్సెన్ సహా ఎందరో ప్రముఖ నటుల చిత్రాలు ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శనకు ఎంపికయ్యాయి. 2020 సెప్టెంబర్ 12వ తేదీన టొరంటో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ వరల్డ్ ప్రీమియెర్ లో కూడా వింటర్ బర్గ్ చిత్రం ప్రదర్శించారు. 2020 సెప్టెంబర్ 24వ తేదీన నార్డిస్క్ ఫిలిం ఈ చిత్రాన్ని డెన్మార్క్ లో కూడా విడుదలయింది. 2020 అక్టోబర్ లో జరిగిన అడిలైడ్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా దీన్ని ప్రదర్శించారు.
***
(Release ID: 1689553)