సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో కెవిఐసీకి 49 కోట్ల రూపాయల కొనుగోలు ఆర్డర్‌ ఇవ్వడం ద్వారా ఖాదీ కళాకారులకు భారీ ప్రోత్సాహం అందించిన రైల్వే శాఖ

Posted On: 16 JAN 2021 3:05PM by PIB Hyderabad

గత సంవత్సరంలో ఖాదీ కార్యకలాపాలు పెద్ద ఎత్తున పుంజుకున్నాయి.  గత ఏడాది కోవిడ్ -19 లాక్డౌన్ కారణంగా ఎక్కువగా ప్రభావితమయింది. ఇలాంటి సందర్భంలో భారత రైల్వే రూ .48.90 కోట్ల విలువైన భారీ కొనుగోలు ఆర్డర్‌ అందించింది. భారతీయ రైల్వే 2020లోని ఒక్క డిసెంబర్‌ నెలలోనే రూ .8.48 కోట్ల విలువైన ఖాదీ వస్తువులను కొనుగోలు చేసింది. తద్వారా కోవిడ్ -19 సంక్షోభ కాలంలో ఖాదీ చేతివృత్తులవారికి ఇది ఉపాధి మరియు ఆదాయాన్ని గణనీయంగా సృష్టించింది.

షీటింగ్ వస్త్రం, తువ్వాళ్లు, బెడ్‌షీట్, ఫ్లాగ్ బ్యానర్, స్పాంజ్ బట్టలు, దోసుటి కాటన్ ఖాదీ, బంటింగ్ బట్టలు మరియు ఇతర వస్తువుల ఉత్పత్తిలో దేశవ్యాప్తంగా నిమగ్నమై ఉన్న 82 ఖాదీ సంస్థలలో నమోదు చేసుకున్న చేతివృత్తులవారికి భారతీయ రైల్వే నుండి కొనుగోలు ఆర్డర్లు నేరుగా ప్రయోజనం చేకూర్చాయి.


మే 2020 నుండి డిసెంబర్ 2020 వరకు (డిసెంబర్ 21 వరకు), భారత రైల్వే 48.90 కోట్ల రూపాయల విలువైన ఖాదీ సామగ్రిని కొనుగోలు చేసింది. ఇది మహమ్మారి సమయంలో ఖాదీ కార్యకలాపాలను కొనసాగించేందుకు అవకాశం కల్పించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న మే, జూన్ నెలల్లో భారతీయ రైల్వే 19.80 కోట్ల రూపాయల వస్తువులను ఖాదీ నుండి కొనుగోలు చేసింది. అదేవిధంగా రైల్వేలు జూలై, ఆగస్టు నెలల్లో రూ .7.42 కోట్ల విలువైన ఖాదీ వస్తువులను కొనుగోలు చేయగా, అక్టోబర్, నవంబర్ నెలల్లో రూ .13.01 కోట్ల విలువైన ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేసింది.


కెవిఐసికి పెద్ద ఆర్డర్లు ఇవ్వడం ద్వారా ఖాదీ చేతివృత్తులవారికి సహకరించినందుకు రైల్వే మంత్రి శ్రీ పియూష్ గోయల్ కు కెవిఐసి చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా కృతజ్ఞతలు తెలిపారు. "మహమ్మారి సమయంలో, కెవిఐసి చేతివృత్తులవారి ఉపాధి మరియు జీవనోపాధిని కొనసాగించే అతిపెద్ద సవాలును ఎదుర్కొంది. మహమ్మారి సమయంలో ఖాదీ మాస్క్‌లు తయారు చేయడంలో కెవిఐసి తన చేతివృత్తులవారిని నిమగ్నం చేసింది; ఇది ఒకేసారి రైల్వేల నుండి పెద్ద మొత్తంలో ఆర్డర్లు అందుకుంది, ఇది ఖాదీ యొక్క స్పిన్నింగ్ వీల్‌ కొనసాగేలా చేయగలిగింది. దీనివల్ల చేతివృత్తులవారికి అదనపు ఉపాధి మరియు ఆదాయం ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఉపయోగపడ్డమే గాక దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడింది ”అని సక్సేనా అన్నారు.

ప్రత్యక్ష కొనుగోళ్ల ద్వారా ఖాదీకి మద్దతు ఇవ్వడమే కాకుండా, ఖాదీ చేతివృత్తులవారిని బలోపేతం చేయడానికి రైల్వే విధాన నిర్ణయాలు కూడా అమలు చేసింది. అందులో భాగంగా రైల్వే శాఖ 400 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. ఆయా స్టేషన్లలో ప్రయాణీకులకు ఆహారం మరియు పానీయాలను విక్రయించడానికి మట్టి పాత్రలు మాత్రమే ఉపయోగించబడతాయి. తద్వారా కుమర్‌షాశక్తికరన్ యోజన కింద కెవిఐసి శిక్షణ పొందిన కుమ్మరుల ఉపాధికి అవకాశం లభించింది. మరో 100 రైల్వే స్టేషన్లను “ప్లాస్టిక్ రహిత స్టేషన్లు” గా మార్చే ప్రణాళికలో రైల్వేశాఖ ఉంది.  

 

*****


(Release ID: 1689235) Visitor Counter : 189