రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

దేశంలో తొలిసారిగా స్వదేశీ 9 ఎం.ఎం. మెషీన్ పిస్టల్‌ తయారీ

Posted On: 14 JAN 2021 4:23PM by PIB Hyderabad

డీఆర్‌డీవో, సైన్యం కలిసి, దేశంలో తొలిసారిగా స్వదేశీ 9 ఎం.ఎం. మెషీన్ పిస్టల్‌ను తయారు చేశాయి. మోవ్‌లో ఉన్న పదాతిదళ పాఠశాల, డీఆర్‌డీవోకు చెందిన, పుణెలోని ఆయుధ పరిశోధన & అభివృద్ధి సంస్థ కలిసి, వారి నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ ఆయుధాన్ని తయారు చేశాయి. రికార్డు స్థాయిలో నాలుగు నెలల్లోనే తయారీ పూర్తయింది. 9 ఎం.ఎం. తూటాలను ఇది పేలుస్తుంది. విమానాల తయారీకి ఉపయోగించే అల్యూమిలియంతో అప్పర్‌ రిసీవర్‌ను, కార్బన్‌ ఫైబర్‌తో లోయర్‌ రిసీవర్‌ను తయారు చేశారు. త్రీడీ ప్రింటింగ్‌లో తయారైన ట్రిగ్గర్‌ సహా వివిధ భాగాలను ఉపయోగించి, మొత్తం పిస్టల్‌ను కూడా త్రీడీ ప్రింటింగ్‌ పద్ధతిలోనే రూపొందించారు. 

    కమాండర్లు, ట్యాంక్, విమాన సిబ్బంది, డ్రైవర్లు/డిస్పాచ్ రైడర్లు, రేడియో/రాడార్ ఆపరేటర్లు, క్లోజ్డ్ క్వార్టర్ బ్యాటిల్, చొరబాట్లు, ఉగ్రవాద నిరోధక జవాన్లకు వ్యక్తిగత ఆయుధంగా, సాయుధ దళాల బలాన్ని ఈ పిస్టల్‌ పెంచుతుంది. కేంద్ర, రాష్ట్ర పోలీస్‌ సంస్థలతోపాటు ప్రముఖుల భద్రతకు, పోలీసింగ్‌కు కూడా ఉపయోగపడుతుంది. ఒక్కో మెషీన్‌ పిస్టల్‌ను రూ.50లోపు ఖర్చుతో తయారు చేయవచ్చు. ఎగుమతులకు కూడా అవకాశం ఉంది.
    
    గర్వకారణం, ఆత్మగౌరవం, కృషి అని అర్ధం వచ్చేలా, ఈ పిస్టల్‌కు "అస్మి" అని పేరు పెట్టారు.

    గౌరవనీయ ప్రధాని ఆశించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ దృష్ట్యా, ఈ చిన్న అడుగు స్వావలంబనకు బాటలు పరుస్తుందని, "సర్వీసెస్‌ అండ్‌ పారామిలిటరీ ఫోర్సెస్" దీనిని త్వరగా తమ అమ్ములపొదిలో చేర్చుకుంటాయని భావిస్తున్నారు.

***
 



(Release ID: 1688658) Visitor Counter : 273