యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
రెండో ‘జాతీయ యువజన పార్లమెంట్ ఉత్సవం’ తాలూకు ముగింపు సభ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
మన జాతీయ జీవనం లో స్వామి వివేకానంద తాలూకు ప్రభావం, ప్రాబల్యం పదిలంగా ఉన్నాయి: ప్రధాన మంత్రి
రాజకీయాల లో నిస్వార్ధంగా, నిర్మాణాత్మకంగా తోడ్పడాలంటూ యువత కు ఆయన ఉద్బోధించారు
రాజకీయ వారసత్వం సామాజిక అవినీతి కి ప్రధాన కారణంగా ఉంది : ప్రధాన మంత్రి
Posted On:
12 JAN 2021 5:52PM by PIB Hyderabad
రెండో ‘జాతీయ యువజన పార్లమెంట్ ఉత్సవం’ తాలూకు ముగింపు సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమం సెంట్రల్ హాల్ లో జరిగింది. ఈ సందర్భం లో ఉత్సవం తాలూకు యువ జాతీయ విజేతలు ముగ్గురు వెల్లడించిన అభిప్రాయాలను కూడా ప్రధాన మంత్రి విన్నారు. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్, కేంద్ర విద్య శాఖ మంత్రి లతో పాటు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) కూడా పాల్గొన్నారు.
స్వామి వివేకానంద ను ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొంటూ, కాలం గడుస్తూనే ఉన్నప్పటికీ స్వామి వివేకానంద తాలూకు ప్రభావం, ప్రాబల్యం మన జాతీయ జీవనం లో పదిలంగా ఉన్నాయన్నారు. జాతీయతావాదం, జాతి నిర్మాణం అంశాలపై ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ప్రజలకు సేవ చేయడానికి, ప్రపంచానికి సేవ చేయడానికి ఆయన చేసిన ప్రబోధాలు మనకు ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయని ఆయన అన్నారు. వ్యక్తుల కు, సంస్థల కు స్వామీ జీ అందించిన తోడ్పాటు ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. స్వామి వివేకానంద తో పరిచయం లభించిన వ్యక్తులు సంస్థల ను స్థాపించారని, మరి అవి వాటి వంతుగా కొత్త సంస్థల ను నిర్మించేవారిని మలచాయని చెప్పారు. ఇది మంచి లక్షణాలు గల వ్యక్తిత్వ వికాసం మొదలుకొని సంస్థల నిర్మాణం వరకు ఒక వలయం లా సాగిపోయింది అని ఆయన వివరించారు. వ్యక్తిగత నవ పారిశ్రామికత్వానికి, గొప్ప కంపెనీలకు మధ్య గల సంబంధాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఈ పరిణామం భారతదేశానికి ఒక పెద్ద బలం గా ఉంది అన్నారు. ఇటీవలి జాతీయ విద్య విధానం అందించిన సరళత్వాన్ని, సరికొత్త అభ్యాస స్వరూపం తాలూకు ప్రయోజనాన్ని అందుకోవలసిందిగా యువత కు ఆయన సూచించారు. మేం దేశం లో ఒక విధమైనటువంటి ఇకోసిస్టమ్ ను ఏర్పరచడానికి ప్రయత్నిస్తున్నాం; అదే గనుక లేకపోతే, తరచు గా విదేశీ తీరాలకేసి చూడక తప్పని స్థితి యువతకు ఎదురయ్యేది అని ప్రధాన మంత్రి అన్నారు.
ధైర్యవంతులైన, నిర్భయులైన, పరిశుద్ధ హృదయం, ధీమా లు కలిగిన యువతీ యువకులను దేశం తాలూకు పునాది గా గుర్తించింది స్వామి వివేకానంద యే అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. యువత కోసం స్వామి వివేకానంద బోధించిన మంత్రాలను శ్రీ మోదీ ప్రస్తావించారు. శారీరక దృఢత్వం కోసం ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు’; వ్యక్తిత్వ వికాసం కోసం ‘మిమ్మల్ని మీరు నమ్మండి’ అనే సలహా ను ఇవ్వడం జరిగిందని; నాయకత్వం, బృంద కృషి ల పరం గా చూసినప్పుడు ‘అందరి పట్ల నమ్మకం ఉంచండి’ అనే మంత్రాలను స్వామీజీ ఉపదేశించారు అని ప్రధాన మంత్రి అన్నారు.
రాజకీయాల లో స్వార్ధరహితంగా, నిర్మాణాత్మకంగా తోడ్పాటు ను అందించాలంటూ యువత కు ప్రధాన మంత్రి ఉద్బోధించారు. ప్రస్తుతం నిజాయితీపరులు సేవ చేసే అవకాశాన్ని అందుకొంటున్నారు. రాజకీయాలంటే నీతినియమాలు లోపించిన కార్యక్షేత్రం అనే ఒక భావాన్ని మారుస్తున్నారు అని ఆయన అన్నారు. నిజాయితీ, పనితీరు అనేవి ప్రస్తుతం ఒక అవసరం గా మారాయి అని ఆయన అన్నారు. ఈ సందర్భం లో వంశానుగత రాజకీయాలను గురించి ప్రధాన మంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు. అవినీతి అనేది ఒక వారసత్వంగా ఉంటూ వచ్చిన వారికి అది ఒక భారం గా మారిపోయింది అని ఆయన చెప్పారు. వంశపారంపర్య వ్యవస్థ ను సమూలంగా తొలగించండి అంటూ యువత కు ఆయన పిలుపును ఇచ్చారు. ప్రజాస్వామిక వ్యవస్థ లో వంశ రాజకీయాలు అసమర్ధత కు, నియంతృత్వానికి చోటును ఇస్తాయని, దానితో అటువంటి వారు కుటుంబ రాజకీయాలతో పాటు రాజకీయాలలో కుటుంబాన్ని కాపాడుకొనే దిశ లో పనిచేస్తారు అని ఆయన అన్నారు. ‘‘ఇవాళ ఒక ఇంటి పేరు ను ఆధారం గా చేసుకొని ఎన్నికల లో గెలిచే రోజులు పోయాయి. అయినప్పటికీ ఈ వంశానుగత రాజకీయాల తాలూకు అనారోగ్యం ఇంకా పూర్తిగా పోనేలేదు.. రాజకీయ వంశవాదం దేశ ప్రజలకు పెద్దపీట వేయడానికి బదులు స్వార్ధాన్ని, కుటుంబాన్ని ప్రోత్సహిస్తుంది. భారతదేశం లో ఇదే సామాజిక అవినీతి కి ఒక పెద్ద కారణం గా నిలుస్తోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
భుజ్ భూకంపం తరువాత పునర్ నిర్మాణ పనులు జరగడాన్ని గురించి ప్రధాన మంత్రి ఉదాహరణ గా చెప్తూ, సంఘం ఒక విపత్తు వేళ తనదైన సొంత మార్గాన్ని వెతుక్కొనేందుకు ప్రయత్నం చేస్తూ తన తలరాతను తానే స్వయం గా రాసుకొంటుందని యువతకు ఆయన తెలిపారు. ఈ కారణం గా భారతదేశం లోని 130 కోట్ల మంది ప్రస్తుతం వారి నుదుటి రాత ను వారే లిఖించుకొంటున్నారు అని ఆయన అన్నారు. ఈ కాలం యువత సొంతం గా చేసే ప్రతి ఒక్క ప్రయత్నమూ, నూతన ఆవిష్కరణ, చిత్తశుద్ధి తో కూడిన ప్రతిజ్ఞ.. ఇవే మన భవిష్యత్తు కు ఒక బలమైన పునాది ని వేస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(Release ID: 1687996)
Visitor Counter : 186