భారత పోటీ ప్రోత్సాహక సంఘం

ఈకామ్‌లో వాటాను కొనుగోలు చేయడానికి పిజి ఎస్మెరాల్డా కు సిసిఐ ఆమోదం

Posted On: 12 JAN 2021 11:03AM by PIB Hyderabad

ఈకామ్‌లో వాటాను కొనుగోలు చేయడానికి పిజి ఎస్మెరాల్డా కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది.

ప్రతిపాదిత కలయిక చేత ఎకామ్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇకామ్) లో వాటాను కొనుగోలు చేయడానికి పిజి ఎస్మెరాల్డా పిటి లిమిటెడ్ (పిజి ఎస్మెరాల్డా) ప్రతిపాదించింది.

భాగస్వాములు నియంత్రిస్తున్న గ్రూప్ ఏజీ లేదా దాని అనుబంధ సంస్థల నిర్వహణలో ఎస్మెరాల్డా పనిచేస్తున్నది. స్విట్జర్లాండ్‌లో ప్రధాన కార్యాలయం కలిగివున్న పార్ట్‌నర్స్ గ్రూప్ గ్లోబల్ ప్రైవేట్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌గా చెప్పవచ్చు. ఇది ఐటి మరియు ఐటి సంబంధిత సర్వీసులు ఆరోగ్య రక్షణ వినియోగ ఉత్పత్తులు,బ్యాంకింగ్ మరియు నాన్-బ్యాంకింగ్ ఆర్ధిక సర్వీసులు వంటి రంగాలలో వివిధ సంస్థలలో పెట్టుబడులు పెడుతుంది.

ఎకామ్ అనేది భారతదేశంలో ఏర్పాటైన సంస్థ. ఇది భారతదేశంలో థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3 పిఎల్) సేవలను అందించే వ్యాపారాన్ని నిర్వహిస్తుంది.

సీసీఐ జారీ చేసిన పూర్తి ఉత్తర్వులు త్వరలో విడుదల అవుతాయి.

***


(Release ID: 1687882) Visitor Counter : 144