భారత పోటీ ప్రోత్సాహక సంఘం

వర్చుసా కార్పొరేషన్‌లో100% పెట్టుబడుల కొనుగోలు మరియు ఉమ్మడి నియంత్రణకు ఆస్టిన్ హోల్డ్‌కో, జిఐసి ఇన్వెస్టర్ మరియు సిపిపిఐబి ఇన్వెస్టర్ కు సిసిఐ ఆమోదం .

Posted On: 12 JAN 2021 11:03AM by PIB Hyderabad

వర్చుసా కార్పొరేషన్‌లో 100%పెట్టుబడులను కొనుగోలు మరియు ఉమ్మడి నియంత్రణకు ఆస్టిన్ హోల్డ్‌కో, జిఐసి ఇన్వెస్టర్ మరియు సిపిపిఐబి ఇన్వెస్టర్ చేసిన ఉమ్మడి ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది.

 

ఇది వర్చుసా కార్పొరేషన్ (వర్టుసా) లో 100% పెట్టుబడులను కొనుగోలు చేసి బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా (బిపిఇఎ) (ఆస్టిన్ హోల్డ్‌కో ద్వారా), అటాగో ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (జిఐసి ఇన్వెస్టర్) మరియు సిపిపి ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ ప్రైవేట్ హోల్డింగ్స్ (4) ఇంక్. (సిపిపిఐబి ఇన్వెస్టర్) ఉమ్మడి నియంత్రణను పొందటానికి సంబంధించిన ఉమ్మడి ప్రతిపాదన.

ఆస్టిన్ హోల్డ్ కో  అనేది డెలావేర్ లో నమోదయిన సంస్థ. ఇది ప్రస్తుతం ఏ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడం లేదు. ఆసియాలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులపై దృష్టి సారించిన అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బీపీఈఎ.

 

జిఐసి ఇన్వెస్టర్ పూర్తిగా అప్స్టార్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది, దీనిపై జిఐసి (వెంచర్స్) ప్రైవేట్ లిమిటెడ్ పూర్తి యాజమాన్య హక్కులను కలిగి ఉంది. ఒక ప్రత్యేక ప్రయోజన సంస్థగా సింగపూర్‌లో జిఐసి ఇన్వెస్టర్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నమోదు అయివుంది. ఇది జిఐసి స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేత నిర్వహించబడే పెట్టుబడి హోల్డింగ్ కంపెనీల సమూహంలో భాగంగా నిర్వహించబడుతున్నది.

 

కెనడాకి చెందిన పెట్టుబడుల సంస్థ సిపిపిఐబి కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ యొక్క పూర్తి యాజమాన్యంలో ఉంది. ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ సంస్థ అయిన కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ వివిధ రంగాల ఆస్తులలో పెట్టుబడులు పెడుతుంది.

 

వర్చుసా గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ. తన అనుబంధ సంస్థల ద్వారా వర్చుసా భారతదేశంలోఔట్ సోర్సింగ్ సేవలు, వ్యాపారం మరియు ఐటి కన్సల్టింగ్ సేవలు, సాంకేతిక అమలు సేవలు, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఐటి సేవలను అందిస్తున్నది.

 

సీసీఐ జారీ చేసిన పూర్తి ఉత్తర్వులు త్వరలో విడుదల అవుతాయి.

 

****



(Release ID: 1687867) Visitor Counter : 188