మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌తో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ శ్రీమతి ఆనందిబెన్‌ పటేల్‌ సమావేశం

Posted On: 11 JAN 2021 4:54PM by PIB Hyderabad

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌తో, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ శ్రీమతి ఆనందిబెన్‌ పటేల్‌ సమావేశమయ్యారు. జాతీయ విద్యావిధానం-2020తోపాటు విద్యారంగ సంబంధిత అంశాలపై ఇరువురు చర్చించారు. విద్యాశాఖ సీనియర్‌ అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. 

    విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖ చేపట్టిన అంగన్‌వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి కార్యక్రమాల గురించి కేంద్రమంత్రికి శ్రీమతి ఆనందిబెన్‌ పటేల్‌ వివరించారు. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యార్థుల కోసం తీసుకొచ్చిన "టీచర్స్‌ గైడ్‌" పుస్తక ప్రతిని మంత్రికి బహూకరించారు. పర్యావరణం, విలువలతోకూడిన విద్య వంటి పాఠ్యాంశాలను  ఉల్లాసభరితంగా నేర్పించే విద్యార్థి కేంద్రీకృత బోధన పద్ధతులపై ఈ పుస్తకం ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేస్తుంది.

    కొత్త విద్యావిధానంలో పేర్కొన్న ప్రకారం "ప్రారంభ బాల్య సంరక్షణ విద్య"కు విద్యాపునాది, అంకెలు నేర్పే విధానాలను విస్తరిస్తామని శ్రీ పోఖ్రియాల్ తెలిపారు. ఈ ప్రకారం అభ్యాస ఫలితాలు, ఉపాధ్యాయుల శిక్షణ వంటి వాటి కోసం ఒక విధానాన్ని తయారు చేస్తామన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక విధానం (ఎన్‌సీఎఫ్‌)ను రూపొందిస్తున్నట్లు కూడా వివరించారు. "టీచర్స్‌ గైడ్‌"లో పేర్కొన్న సూచనలను పరిశీలించి, ఎన్‌సీఎఫ్‌లో పొందుపరుస్తామని శ్రీ పోఖ్రియాల్‌ చెప్పారు.

 

***



(Release ID: 1687673) Visitor Counter : 127