ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్-19 వాక్సిన్ సంసిద్ధత పరీక్షకు జనవరి 8న అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో మరో భారీ మాక్ డ్రిల్

1.7 లక్షల మందికి వాక్సిన్ :వాక్సిన్ ఇవ్వడానికి 3 లక్షల మంది బృంద సభ్యులకు శిక్షణ

Posted On: 06 JAN 2021 7:25PM by PIB Hyderabad

దేశంలో ప్రజలకు కొవిడ్-19 వాక్సిన్ ను ఇవ్వడానికి కేంద్రప్రభుత్వం సిద్ధం అవుతోంది. కార్యక్రమం సజావుగా ఎలాంటి సమస్యలు లేకుండా అమలు జరిగేలా చూడడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇతర భాగస్వాములతో కలసి రంగం సిద్ధం చేస్తున్నది. ఈ భారీ కార్యక్రమ నిర్వహణకు గత రెండు నెలలుగా సన్నాహక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.

రెండు వాక్సిన్ ల అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ అఫ్ ఇండియా ( డీసీఐజీ)ఇటీవల అనుమతులు మంజూరు చేయడంతో త్వరలో కొవిడ్-19 వాక్సిన్ ఇచ్చే కార్యక్రమం అమలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ భారీ కార్యక్రమాన్ని అమలు చేయడానికి యంత్రాంగం సమర్ధతను తెలుసుకొని పొరపాట్లను సరిదిద్దుకోవలసి ఉంటుంది.

వాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని కార్యరూపంలోకి తెచ్చే ముందు వాస్తవ పరిస్థితి ప్రతిబించే విధంగా జనవరి 8వ తేదీన దేశవ్యాపితంగా మరోసారి మాక్ డ్రిల్ ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 700 పైగా జిల్లాల్లో ( ఇప్పటికే మాక్ డ్రిల్ ను ఈ నెల 5వ తేదీన నిర్వహించిన, 7 వ తేదీన నిర్వహించనున్న ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా రాష్ట్రాలను మినహాయించి) 8వ తేదీన మాక్ డ్రిల్ ను నిర్వహిస్తారు. ప్రతి జిల్లాలో వాక్సిన్ సరఫరా మరియు దానిని ఇవ్వడానికి సమర్ధంగా ప్రణాళికను రూపొందించాలన్న లక్ష్యంతో మాక్ డ్రిల్ ను నిర్వహిస్తారు. గత మాక్ డ్రిల్ లో చేసిన విధంగానే ఈసారి కూడా వాక్సిన్ కార్యక్రమ నిర్వహణకు మూడు ప్రాంతాలను గుర్తిస్తారు. ప్రజా ఆరోగ్య కేంద్రం ( జిల్లా ఆసుపత్రి/వైద్య కళాశాల), ఒక ప్రైవేట్ ఆరోగ్య కేంద్రం మరియు గ్రామీణ లేదా పట్టణ కేంద్రం లో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

డ్రై రన్ ను ఏవిధంగా నిర్వహించాలి అన్న అంశాన్ని చర్చించడానికి జనవరి 7వ తేదీన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖల మంత్రులతో సమావేశం కానున్నారు. జిల్లా కలెక్టర్/జిల్లా మేజిస్ట్రేట్ నాయకత్వంలో లబ్ధిదారుల నమోదు, ఎంపిక చేసిన కేంద్రాలలో అమలు చేయవలసిన సూక్మ ప్రణాళిక ,వాక్సిన్ ఇవ్వడం తదితర అంశాలపై ప్రణాళిక రూపకల్పన జరుగుతుంది. దీనివల్ల వాక్సిన్ ఇచ్చే సమయానికి దీనిపై రాష్ట్ర,జిల్లా, బ్లాకు, ఆస్పత్రి స్థాయి అధికకారులకు పూర్తి అవహగాహన కలుగుతుంది. ప్రణాళికల అమలు, నివేదికల తయారీలో ఎదురయ్యే సమస్యలు ఇతర సమస్యలను ముందుగానే గుర్తించడానికి ఈ డ్రై రన్ వల్ల అవకాశం కలుగుతుంది. కార్యాచరణ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అన్ని స్థాయిలలో అధికారులు సిబ్బంది సిద్ధంగా ఉండడానికి ఇది దోహదపడుతుంది.

డ్రై రన్ జరిగే రోజున రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ సమాచారం ఆధారంగా సమస్యలను పరిష్కరించి కార్యక్రమం సజావుగా సాగేలా చూస్తుంది.

మొత్తం వాక్సిన్ ప్రక్రియను సులభతరం చేయడానికి, వాక్సిన్ నిల్వలు, వాటి నిల్వ ఉష్ణోగ్రత మరియు లబ్ధిదారుల సమాచార సేకరణకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కో-విన్అనే సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసింది. వాక్సిన్ నిర్వహణలో ఈ సాఫ్ట్ వేర్ అన్ని స్థాయిలలోని నిర్వాహకులకు సహాయకారిగా కో-విన్ వినియోగదారుల సాంకేతిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి 24 గంటలూ పనిచేసే కాల్ సెంటర్ కూడా స్థాపించబడింది. కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలు (వాక్-ఇన్-ఫ్రీజర్స్, వాక్-ఇన్-కూలర్లు, ఐస్-లైన్డ్ రిఫ్రిజిరేటర్లు, డీప్ ఫ్రీజర్ లు వంటివి) కల్పన, అవసరమైన సంఖ్యలో సిరంజిలను అందుబాటులో తేవడంతో కొవిడ్ -19 టీకా డ్రైవ్ ను చేపట్టడానికి రంగం సిద్ధం అయ్యింది.

లబ్ధిదారుల ధృవీకరణ, వాక్సిన్ , కోల్డ్ చైన్ రవాణా, బయో మెడికల్ వ్యర్ధాల నిర్వహణ , ఎఇఎఫ్ ఐ మేనేజ్ మెంట్ మరియు నివేదికల సమర్పణ ప్రక్రియపై సుమారు 1.7 లక్షల మంది వ్యాక్సినేటర్లు మరియు 3 లక్షల టీకా బృందం సభ్యులకు శిక్షణ ఇవ్వబడింది.. వాక్సిన్ ఇచ్చే సమయాల రూపకల్పన నిర్వహణ ఎ ఈ ఎఫ్ ఐ నిర్వహణ , ఐఈసీ సందేశాలు, వ్యాధుల సంక్రమణ నివారణ నియంత్రణ పద్ధతులు మొదలైన వాటితో సహా కొవిడ్ -19 వాక్సిన్ తదితర యొక్క అన్ని అంశాలపై వివరణాత్మక కార్యాచరణ మార్గదర్శకాలు ఇప్పటికే రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు పంపడం జరిగింది.

***



(Release ID: 1686680) Visitor Counter : 192