భారత ఎన్నికల సంఘం
శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు) ఎన్నుకునే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక
Posted On:
06 JAN 2021 2:36PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శాసనసభ సభ్యులు ఎన్నుకునే ఒక స్థానం ఖాళీ ఉంది. ఖాళీ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
సభ్యురాలి పేరు
|
ఎన్నిక స్వభావం
|
ఖాళీ ఏర్పడడానికి కారణం
|
పదవీ కాలం గడువు
|
శ్రీమతి పోతుల సునీత
|
ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక
|
01.11.2020 తేదీన రాజీనామా
|
29.03.2023
వరకు
|
2. పై పేర్కొన్న స్థానం ఖాళీ ఏర్పడడం వల్ల ఉప ఎన్నిక కింద తెలిపిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.
క్రమ సంఖ్య
|
ఎన్నిక వివరాలు
|
తేదీలు
|
-
|
నోటిఫికేషన్ జారీ
|
11 జనవరి 2021 (సోమవారం)
|
-
|
నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ
|
18 జనవరి , 2021 (సోమవారం)
|
-
|
నామినేషన్ల పరిశీలన
|
19 జనవరి 2021 (మంగళవారం)
|
-
|
అభ్యర్థిత్వం
ఉపసంహరణకు
చివరి తేదీ
|
21జనవరి 2021 (గురువారం)
|
-
|
పోలింగ్ తేదీ
|
28 జనవరి 2021 (గురువారం)
|
-
|
పోలింగ్ సమయం
|
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు
|
-
|
ఓట్ల లెక్కింపు
|
28 జనవరి 2021 (గురువారం) సాయంత్రం 5గంటలకు
|
-
|
ఎన్నికలు పూర్తవ్వడానికి
చివరి తేదీ
|
01 ఫిబ్రవరి 2021 (సోమవారం)
|
3. అందరు వ్యక్తులు ఎన్నికల ప్రక్రియ సందర్బంగా విస్తృత మార్గదర్శకాలను అనుసరించాలి:-
I. ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో ప్రతి ఒక్కరు ముఖానికి మాస్క్ ధరించాలి.
II. ఎన్నికల అవసరాలకు ఉపయోగించే హాల్/గది/ప్రాంగణం ప్రవేశం వద్ద:
(a) ప్రవేశించే అందరికి థర్మల్ స్క్రీనింగ్ చేయాలి
(b) స్థలాల్లో శానిటైజర్ అందుబాటులో ఉంచాలి
III. కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సూచించిన తాజా కోవిడ్-19 మార్గదర్శకాలలో భాగంగా సామజిక దూరం పాటించాలి.
4. ఎన్నికల నిర్వహణలో కోవిడ్-19 నియంత్రణ చర్యల నిబంధనలు గట్టిగ అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక సీనియర్ అధికారిని నియమించాలి.
****
(Release ID: 1686627)
Visitor Counter : 121