ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్ 19 నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఉన్నతస్థాయి బృందాన్ని కేరళకు పంపుతున్న కేంద్ర ప్రభుత్వం

Posted On: 06 JAN 2021 6:13PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) డైరెక్టర్ డాక్టర్ ఎస్ కె సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కేంద్ర బృందాన్ని కేరళకు నియమించింది. ఈ బృందం  ఎల్లుండి ఆ రాష్ట్రానికి చేరుకుంటుంది.


కోవిడ్ -19 నిర్వహణలో కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజారోగ్య విధానాలను ఈ బృందం సమీక్షిస్తుంది. ఈ ఆంశంలో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులకు సహకారం అందిస్తుంది.


కేరళలో గత కొన్ని రోజులుగా నిత్యం ఎక్కువ మొత్తంలో కొత్త కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి


గత ఏడు రోజుల్లో మొత్తం 35,038 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర కొవిడ్ 19 గణాంకాల ప్రకారం ప్రతిరోజూ 5,000 కేసులు వెలుగుచూస్తున్నయి.


గత వారంలో ప్రతిరోజూ నమోదైన కేసుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:


కొవిడ్  నిర్వహణలో వివిధ రాష్ట్ర /కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలకు సహకారం అందించేందుకు..ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యటించేందుకు కేంద్ర బృందాలను నియమించింది. ఈ బృందాల్లోని సభ్యులు రాష్ట్ర / యుటి అధికారులతో  ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతారు. తద్వారా వారు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పొందుతారు. అనంతరం ఆ ఇబ్బందులను అదిగమించేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తారు.

***



(Release ID: 1686613) Visitor Counter : 149