విద్యుత్తు మంత్రిత్వ శాఖ
కేంద్రప్రభుత్వ ఉజాలా, ఎస్ ఎల్ ఎన్ పి పథకాల అమలుకు ఆరేళ్లు. దేశవ్యాప్తంగా
సమర్థవంతంగా దేదీప్యమాన వెలుగులు ప్రసాదిస్తున్న పథకాలు.
దేశవ్యాప్తంగా నివాస గృహాలకు, బహిరంగ ప్రదేశాల్లోను విద్యుదీకరణ వ్యవస్థల ఏర్పాటుకు దోహదం చేసిన రెండు పథకాలు
ఉజాలా పథకం కింద 36.69 కోట్ల లెడ్ బల్బుల పంపిణీతోపాటు, 1.14 కోట్ల లెడ్ వీధి దీపాలను ఏర్పాటు చేసిన ఇఇఎస్ ఎల్. తద్వారా ప్రతి ఏడాది 55.32 బిలియన్ కెడబ్ల్యు హెచ్ విద్యుత్ ఆదా
ఎస్ ఎల్ ఎన్ పి కింద 1.14 కోట్ల లెడ్ వీధి దీపాలను ఏర్పాటు చేసిన ఇఇఎస్ ఎల్. తద్వరా ప్రతి ఏడాది 7.67 బిలియన్ కెడబ్ల్యుహెచ్ విద్యుత్ ఆదా.
Posted On:
05 JAN 2021 6:43PM by PIB Hyderabad
కేంద్రప్రభుత్వం రూపొందించిన భారత దేశ జీరో రాయితీ పథకాలైన ఉన్నత జ్యోతి బై అఫర్డబుల్ లెడ్స్ ఫర్ ఆల్ (ఉజాలా) పథకం, స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్ ( ఎస్ ఎల్ ఎన్ పి)లను 2015 జనవరి 5న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. దాంతో ఈ జనవరి 5నాటికి ఈ పథకాలు ప్రారంభించి ఆరేళ్లవుతుంది.
ఈ రెండు పథకాలను కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని పిఎస్ యుల జాయింట్ వెంచర్ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ( ఇఇఎస్ ఎల్) అమలు చేస్తోంది. ఉజాలాపథకం కింద ఇఇఎస్ ఎల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 36. 69 కోట్ల లెడ్ బల్బులను పంపిణీ చేయడం జరిగింది. తద్వారా ప్రతి ఏడాది 47.65 బిలియన్ కెడబ్ల్యు హెచ్ విద్యుత్ ఆదా అవుతోంది. అంటే ఆ మేరకు 9, 540 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ లేకపోవడంవల్ల దీనికి సంబంధించి గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు తగ్గిపోతాయి. తద్వారా ప్రతి ఏడాది 38.59 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపు వుంటుంది. ఈ పథకం కింద అదనంగా 72 లక్షల లెడ్ ట్యూబ్ లైట్లను, 23 లక్షల విద్యుత్ ఆదా పంఖాలను అందుబాటు ధరల్లో అందించడం జరిగింది.
ఎస్ ఎలన్ ఎన్ పి కింద ఇఇఎస్ ఎల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 1.14 కోట్ల లెడ్ వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ప్రతి ఏడాది 7.67 బిలియన్ కెడబ్ల్యు హెచ్ విద్యుత్ ఆదా అయింది. అంటే ప్రతి 5.29 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించగలిగేలా 1, 280 మెగావాట్ల విద్యుత్తు ఆదా అయింది. అంతే కాదు ప్రతి ఏడాది మునిసిపాలిటీలకు 5, 210 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు ఆదా అయ్యాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్ .కె. సింగ్ ఉజాలా, ఎస్ ఎల్ ఎన్ పి కార్యక్రమాల గొప్పదనాన్ని వివరించారు. ఈ రెండూ భారీ స్థాయిలో సామాజిక ఆర్ధిక మార్పుకు దోహదం చేశాయని అన్నారు. వీటి కారణంగా ఉద్గారాలు తగ్గడమే కాకుండా దేశశ్యాప్తంగా ఇటు నివాస గృహాల్లోను, అటు వీధుల్లోను విద్యుత్ సౌకర్యం కల్పించామని అన్నారు. భారతదేశ విద్యుత్ రంగంలో మార్పు తేవడానికి వీలుగా ఆరేళ్లుగా ఈ రెండ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు ఇఇఎస్ ఎల్ కు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఇఇఎస్ ఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్ పర్సన్ శ్రీ సౌరభ్ కుమార్ తాము పెట్టుకున్న లక్ష్యాలను అందుకున్నామని ఇంకా చేయాల్సింది చాలా వుందని అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఇఇఎస్ ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రజత్ సూద్ పర్యావరణానికి మేలు చేసే విధంగా విద్యుత్తును సమర్థవంతంగా వినియోగించుకోవడం జరిగిందని అన్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో వాతవరణ మార్పులకు వచ్చిన ప్రమాదం గురించి ఆయన ప్రస్తావించారు. విద్యుత్తు ఆదాకారణంగా ఆర్ధికపరంగా మేలు జరిగిందని అన్నారు.
భారతదేశవ్యాప్తంగా లెడ్ లైటింగ్ ద్వారా వెలుగులు పంచడానికి ఉపయోగపడ్డ ఈ రెండు పథకాలకు పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
ఉజాలా పథకం కారణంగా సమర్థ విద్యుత్ వినియోగం జరిగి ఈ రంగంలో అభివృద్ధి జరిగింది. కోట్లాది కుటుంబాలు ఇన్ కాండిసెంట్ బల్బుల స్థానంలో లెడ్ బల్బులను ఉపయోగించడంవల్ల విద్యుత్ వినియోగం సమర్థవంతంగా జరిగింది. విద్యుత్ బిల్లు తగ్గింది. అంతే కాదు ఇళ్లలో వెలుగు పెరిగింది. విద్యుత్ బిల్లుల రూపంలో ఆదా అయిన డబ్బు కుటుంబాల ప్రగతికి దోహదం చేసింది.
ఎస్ ఎల్ ఎన్ పి పథకం అమలుకు సంబంధించి రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో మరింత మార్పు తేవడానికిగాను ఇఇఎస్ ఎల్ విశిష్టమైన ప్రణాళిక రూపొందిస్తోంది. 2024 నాటికి రూ.8 వేల కోట్ల పెట్టుబడులను తేవడంద్వారా మొత్తం గ్రామీణ భారతదేశంలో వీధి దీపాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు.
****
(Release ID: 1686438)
Visitor Counter : 195