మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జెఎన్‌యులో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయి స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ భవనాలకు పునాది రాయి వేసిన కేంద్ర విద్యామంత్రి
Posted On:
04 JAN 2021 8:15PM by PIB Hyderabad
జవహర్‌లాల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయి స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ భవనాలకు సోమవారం దృశ్య మాధ్యమం ద్వారా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశంక్ పునాది రాయి వేశారు. జెఎన్‌యు వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ ఎం. జగదీష్ కుమార్, రెక్టార్ 1 ప్రొఫెసర్ చింతామణి మహాపాత్ర, రెక్టార్ II ప్రొఫెసర్ సతీష్‌చంద్ర గర్కోటి, రెక్టార్ III ప్రొఫెసర్ రాణా ప్రతాప్ సింగ్, నూతన స్కూళ్ళ డీన్లు ప్రొఫెసర్ ఉన్నత్ పండిత్, ప్రొఫెసర్ సత్యవ్రత్ పట్నాయక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు ప్రతిభావంతమైన, దార్శనిక భారత ప్రధానమంత్రి , స్ఫూర్తినిచ్చే రచనల రచయిత దివంగతఅటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టడం పట్ల పోఖ్రియాల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ విద్య ఒకదానికొకటి పరిపూర్ణం చేస్తూ యువత ఔత్సాహిక వ్యాపారవేత్తలు, స్వావలంబనతో జీవించేందుకు స్ఫూర్తినిస్తుందని మంత్రి అన్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మించాలని ప్రతిపాదించిన భవనాలు సాంకేతికత ఆధారిత అభ్యాసం, విద్యార్ధుల వృద్ధికి దోహదం చేసేలా ఉంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
విశ్వవిద్యాలయాలను పురోగమన దిశగా నూతన ఎత్తులకు తీసుకువెళ్ళడమే కాక నూతన చొరవలతో నూతన విద్యా విధానం 2020ను సాధించేందుకు చొరవలు చేపట్టిన ప్రొఫెసర్ జగదీష్ కుమార్‌ను ఈ సందర్భంగా పోఖ్రియాల్ అభినందించారు.
ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ ప్రమోద్ కుమార్ వందన సమర్పణ చేశారు.
***
(Release ID: 1686235)
Visitor Counter : 164