రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్‌కు రూ.5.625 కోట్ల రూపాయల డివిడెండ్‌ను అందించిన బీఈఎంఎల్

Posted On: 04 JAN 2021 6:23PM by PIB Hyderabad

ర‌క్ష‌ణ రంగంలోని ప్ర‌భుత్వ రంగ సంస్థ (డీపీఎస్‌యు) 'భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్' (బీఈఎంఎల్) ఈ రోజు న్యూ ఢిల్లీలో ర‌క్ష‌ణ శాఖ‌‌ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్‌కు రూ.5.625 కోట్ల విలువైన డివిడెండ్‌ను అందించింది. డివిడెండ్‌న‌‌కు సంబంధించి చెక్కును బీఈఎంఎల్ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డాక్టర్ దీపక్ కుమార్ హోటా మంత్రికి అందజేశారు. కంపెనీకి చెందిన షేరు ఒక్కింటికి రూ.6 డివిడెండ్ ప్రకటించింది. ఈ మొత్తం చెల్లింపు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.24.99 కోట్ల ఈక్విటీ షేర్ క్యాపిటల్‌కు స‌మాన‌మైంది. 1964వ‌ సంవ‌త్స‌రం ఏర్పాటు చేయ‌బ‌డిన.. బీఈఎంఎల్ అనేది షెడ్యూల్ 'ఎ' సంస్థ‌. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ(ఎంఓడీ) కింద ప‌ని చేస్తోంది. ఇది ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు కీల‌కంగా నిలిచే బొగ్గు, మైనింగ్, సిమెంట్, ఉక్కు, విద్యుత్ రంగ‌, నీటిపారుదల, నిర్మాణం, రహదారి భవనం, రక్షణ, రైల్వే మరియు మెట్రో రవాణా వ్యవస్థ మ‌రియు ఏరోస్పేస్ వంటి రంగాల‌కు చెందిన వివిధ ఉత్ప‌త్తుల రూప‌క‌ల్ప‌, త‌యారీ, విక్ర‌యం త‌రువాత సేవ‌ల‌ను అందిస్తోంది. బీఈఎంఎల్ అనేది ఒక లిస్టెడ్ కంపెనీ. కంపెనీ మొత్తం చెల్లించిన మూలధనంలో 54.03 శాతం వాటాను ప్రభుత్వం కలిగి ఉంది. బీఈఎంఎల్ సంస్థ రక్షణ విభాగంలో మొబిలిటీ మ‌రియు రికవరీ వాహనాలు, వంతెన వ్యవస్థలు, క్షిపణి ప్రాజెక్టుల వాహనాలు, ట్యాంక్ రవాణా ట్రెయిలర్లు, మిల్‌రైల్వాగన్లు, గని ఫ్ల‌గ్స్‌, క్రాష్ ఫైర్ టెండర్లు, విమానాల‌ను అటుఇటు జ‌రిపేందుకు అవ‌స‌ర‌మైన‌ ట్రాక్టర్లు, విమాన ఆయుధ లోడింగ్ ట్రాలీ మొదలైన వాటిని అందిస్తుంది. ఈ రోజుకు కంపెనీ రూ.11500 కోట్లకు పైగా ఆర్డ‌ర్ల‌ను క‌లిగి ఉంది. ఇందులో కొన్ని ర‌కాల ప‌నులు ఇప్ప‌టికే అమ‌లులో ఉన్నాయి. ఇందులో సీఐఎల్‌కు భారతదేశ అతిపెద్ద రూపకల్పన, అభివృద్ధి చెంసిన 190టీ డంప్ ట్రక్కులు, ఎంఎంఆర్‌డీఏకు సంబంధించిన డ్రైవర్ ర‌‌హిత మెట్రో కార్లు (గమనింపబడని రైలు ఆపరేషన్-యుటీఓ), దీనికి తోడుగా రక్షణ సేవలకు హై మొబిలిటీ ట్రక్కుల కోసం బ్రిడ్జ్ సిస్టమ్స్, క్షిపణి వ్యవస్థసరఫరా చేయడం త‌దిత‌రాలున్నాయి. ఈ కార్యక్రమంలో కార్యదర్శి (డిఫెన్స్ ప్రొడక్షన్) శ్రీ రాజ్ కుమార్, ఎంఓడీ డీపీఎస్‌యుల‌ యొక్క ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

****


(Release ID: 1686131) Visitor Counter : 130