ప్రధాన మంత్రి కార్యాలయం
ఒక రంగం లో జరుగుతున్న పరిశోధనల తాలూకు ఫలితాలను ఇతర రంగంలో సమర్ధంగా ఉపయోగించుకోవాలని, నూతన ఆవిష్కరణలకు సంస్థాగత రూపాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి
Posted On:
04 JAN 2021 2:37PM by PIB Hyderabad
పరిశోధన కూడా మనిషి ఆత్మ మాదిరి గానే ఒక నిత్య వ్యవస్థే అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఒక రంగంలో జరిగే పరిశోధన తాలూకు ఫలితాలను ఇతర రంగాలలో ఉపయోగించుకోవడం, నూతన ఆవిష్కరణ కు సంస్థాగత రూపాన్ని ఇవ్వడం అనే రెండు లక్ష్యాలను అందుకొనే దిశ లో ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. ‘నేశనల్ మెట్రలాజి కాన్‌క్లేవ్ 2021’ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ‘నేశనల్ అటామిక్ టైమ్ స్కేల్’ ను, ‘భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళి’ ని కూడా దేశ ప్రజలకు అంకితం చేశారు. అంతేకాకుండా, నేశనల్ ఇన్‌వైరన్ మంటల్ స్టాండర్డ్ స్ లబారటరి కి కూడాను శంకుస్థాపన చేశారు.
వివిధ జ్ఞాన రంగాల లో పరిశోధన తాలూకు ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఏ ప్రగతిశీల సమాజం లో అయినా పరిశోధన అనేది ఒక స్వాభావికమైన అలవాటు మాత్రమే కాక సహజ ప్రక్రియ కూడా అని ఆయన అన్నారు. పరిశోధన తాలూకు ప్రభావం వాణిజ్య సరళికి చెందింది గానీ లేదా సామాజిక పరమైంది గానీ కావచ్చని, అయితే పరిశోధన మన జ్ఞానాన్ని, అవగాహన ను పెంచుకోవడంలో కూడా సహాయకారి అవుతుందని ఆయన అన్నారు. పరిశోధన తాలూకు భావి దిశ ను, పరిశోధన తాలూకు ఉపయోగాలను, దాని అంతిమ లక్ష్యాన్ని ముందస్తుగా అంచనా వేయడం ఎల్లవేళల సాధ్యపడేది కాదు. కేవలం ఒకటే ఖాయమవుతుంది, అది ఏమిటంటే పరిశోధన అనేది జ్ఞానం లో ఒక కొత్త అధ్యాయానికి దారి తీస్తుందని, మరి అది ఎన్నటికీ వృథా పోదనేదే నని ఆయన అన్నారు. జన్యుశాస్త్ర పిత శ్రీ మెందెల్, శ్రీ నికోలస్ టెస్ లా లను ఉదాహరణ గా ఆయన చెప్తూ, వారు చేసిన పనులకు చాలా కాలం అనంతరం గుర్తింపు దక్కింది అని తెలిపారు.
అనేక సార్లు జరిగేది ఏమిటంటే పరిశోధన మన తాత్కాలిక లక్ష్యాలను నెరవేర్చకపోవచ్చు, అయితే అదే పరిశోధన కొన్నివేరే రంగాల లో ఎంతో మహత్వపూర్ణమైంది కావచ్చు అని ఆయన అన్నారు. శ్రీ జగదీశ్ చంద్ర బోస్ తాలూకు ఉదాహరణ ను ప్రస్తావించడం ద్వారా ఈ అంశాన్ని ప్రధాన మంత్రి వివరించే ప్రయత్నం చేశారు. శ్రీ బోస్ ప్రతిపాదించిన మైక్రోవేవ్ థియరి ని ఆయన కాలంలో వాణిజ్యం దృష్టి లో లాభప్రదం కాలేకపోయింది, కానీ ప్రస్తుతం యావత్తు రేడియో కమ్యూనికేశన్ సేవ దాని మీదే ఆధారపడి ఉంది అని ఆయన అన్నారు. ప్రపంచ యుద్ధాల కాలం లో జరిపిన పరిశోధనల తాలూకు ఉదాహరణలను కూడా ఆయన ప్రస్తావించారు. ఆ పరిశోధన లు తరువాత తరువాత వేరు వేరు రంగాలలో విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టాయన్నారు. ఉదాహరణకు తీసుకొంటే, డ్రోన్స్ ను యుద్ధం కోసమే తయారుచేసినప్పటికీ వర్తమానం లో అవి ఫోటోలను తీసుకోవడానికి, సరకుల అప్పగింత కు ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ కారణం గా మన శాస్త్రవేత్తలు, ప్రత్యేకించి యువ వైజ్ఞానికులు, పరిశోధన తాలూకు ఉపయోగాలను ఇతర రంగాలలో వినియోగించుకొనే అవకాశాలు ఉన్నాయేమో శోధించాలి అని ఆయన సూచించారు. వారి పరిశోధన వారి రంగానికి ఆవల సైతం ఉపయోగపడేలా వారు ఎల్లప్పటికీ ఆలోచిస్తూ ఉండాలి అని ఆయన సూచించారు.
ఏదైనా చిన్న పరిశోధన ప్రపంచం రూపురేఖలను ఏ విధంగా మార్చగలుగుతుందో తెలియజేయడానికి ప్రధాన మంత్రి విద్యుత్తు తాలూకు ఉదాహరణ ను ప్రస్తావించారు. విద్యుత్తు ఇవాళ ప్రతిదానిని నడుపుతోంది, అది రవాణా కావచ్చు, కమ్యూనికేశన్ కావచ్చు, పరిశ్రమ కావచ్చు, లేదా నిత్య జీవనం కావచ్చు .. విద్యుత్తు పాత్ర బహుముఖాలుగా ఉందన్నారు. అదే విధంగా, సెమి- కండక్టర్ వంటి ఆవిష్కరణ డిజిటల్ విప్లవం రూపేణా మన జీవనాన్ని సుసంపన్నం చేసిందన్నారు. ఆ కోవ కు చెందిన అనేక అవకాశాలు మన యువ పరిశోధకుల కళ్లెదుట ఉన్నాయని ఆయన చెప్పారు. మన యువ పరిశోధకులు వారి పరిశోధన ద్వారా, వారి ఆవిష్కరణల ద్వారా సంపూర్ణంగా భిన్నమైన భవిష్యత్తు కు బాట వేయగలుగుతారని ప్రధాన మంత్రి అన్నారు.
భావి కాలానికి తగినదిగా ఉండే ఇకో-సిస్టమ్ ను సృష్టించడానికి ఏయే ప్రయత్నాలు సాగాలో కూడా ప్రధాన మంత్రి ఒక్కటొక్కటిగా వివరించారు. భారతదేశం గ్లోబల్ ఇనొవేశన్ ర్యాంకింగ్ లో అగ్రగామి 50 స్థానాల లోకి అడుగుపెట్టిందని, విజ్ఞాన శాస్త్రం, ఇంజినీరింగ్, ప్రచురణల సమకాలిక సమీక్షల లో భారతదేశం మూడో స్థానాన్ని సంపాదించిందని, ఇది ప్రాథమిక పరిశోధన కు కట్టబెడుతున్న ప్రాధాన్యాన్ని నిరూపిస్తోందని ఆయన అన్నారు. పరిశ్రమకు, సంస్థలకు మధ్య సహకారాన్ని పటిష్టపరచడం జరుగుతోందని ఆయన చెప్పారు. ప్రపంచం లో పెద్ద కంపెనీలు అన్నీ కూడాను వాటి పరిశోధన కేంద్రాలను భారతదేశంలో ఏర్పాటు చేస్తున్నాయన్నారు. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఆ కోవ కు చెందిన కేంద్రాలు గణనీయం గా పెరిగాయి అని ఆయన చెప్పారు.
భారతదేశం లోని యువతీయువకులకు పరిశోధన, ఆవిష్కరణల తాలూకు అవకాశాలు అపారంగా ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. కాబట్టి ఆవిష్కరణ ప్రక్రియ తాలూకు వ్యవస్థీకరణ జరగడం సైతం ఆవిష్కరణ మాదిరిగా సమాన ప్రాధాన్యం కలిగినటువంటిదని ఆయన చెప్పారు. మేధా సంపత్తి ని ఎలా పరిరక్షించుకోవాలో మన యువజనులు గ్రహించాలి అని ఆయన అన్నారు. మనకు ఎన్ని ఎక్కువ పేటెంట్ లు ఉంటే వాటి తాలూకు ప్రయోజనం అంత అధికం గా ఉంటుంది అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రధాన మంత్రి అన్నారు. మన పరిశోధన దృఢంగాను, అత్యంత అధునాతనమైందిగాను ఉండే రంగాలలో మన గుర్తింపు బలవత్తరంగా మారుతుంది అని ఆయన చెప్పారు. దీనితో మనం ఒక సుదృఢ ‘బ్రాండ్ ఇండియా’ వైపు ముందుకు సాగగలుగుతాము అని ప్రధాన మంత్రి అన్నారు.
శాస్త్రవేత్తలను కర్మయోగులు గా ప్రధాన మంత్రి అభివర్ణిస్తూ, ప్రయోగశాల లో వారు తపస్వుల వలె నిష్ఠ గా పని లో తలమునకలు అవుతారంటూ ఆయన ప్రశంసలు కురిపించారు. వారు 130 కోట్ల మంది భారతీయుల ఆశలకు, ఆకాంక్షలకు ఒక వాహకం గా ఉన్నారని ఆయన అన్నారు.
-Narendra Modi
@narendramodi
Research, like the human soul, is eternal!
We are working towards two objectives:
Cross-utilisation of research.
Institutionalising innovation.
The advantages of doing so are many.
https://twitter.com/i/status/1346003003678085125
***
(Release ID: 1686012)
Visitor Counter : 200
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam