రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆర్మీ డే పరేడ్

प्रविष्टि तिथि: 02 JAN 2021 11:08AM by PIB Hyderabad

దిల్లీలోని 'కరియప్ప పరేడ్‌ గ్రౌండ్‌'లో ఈనెల 15న 'ఆర్మీ డే పరేడ్‌'ను నిర్వహించనున్నారు. దీంతోపాటు, గణతంత్ర దినోత్సవ కవాతు, బీటింగ్‌ రిట్రీట్‌ వివరాలపై ఈనెల 23న మీడియా సమావేశం ఉంటుంది. మీడియా సమావేశ ప్రాంతాన్ని త్వరలో ప్రకటిస్తారు.

    ఆసక్తిగల మీడియా సిబ్బంది, భద్రతపరమైన అనుమతుల కోసం ఈ క్రింది వివరాలను armydayparade2021[at]gmail[dot]com కు ఈనెల 5వ తేదీ లోగా పంపాలి.

దరఖాస్తుదారుని పూర్తి పేరు
పీఐబీ/గుర్తింపుకార్డు సంఖ్య
స్కాన్‌ చేసిన గుర్తింపు కార్డు ప్రతి
మీడియా సంస్థ పేరు
దరఖాస్తుదారుని ఫొటో
దరఖాస్తు చేస్తున్నది: ఏడీపీ/మీడియా సమావేశం/రెండు

    దీనిపై ఏమైనా సందేహాలుంటే 011-23019659 కు ఫోన్‌ చేయవచ్చు. 5వ తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించరు.

***


(रिलीज़ आईडी: 1685604) आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Tamil