ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఐఎఫ్ఎస్సీఏ ఐఓఎస్సీఓ లో సభ్యత్వం తీసుకుంటుంది
Posted On:
01 JAN 2021 1:15PM by PIB Hyderabad
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమీషన్స్ (ఐఓఎస్సీఓ) లో అసోసియేట్ సభ్యురాలిగా మారింది.
ఐఓఎస్సీఓ... ప్రపంచంలోని సెక్యూరిటీ రెగ్యులేటర్లను కలిపే అంతర్జాతీయ సంస్థ. ఇది ప్రపంచంలోని 95% కంటే ఎక్కువ సెక్యూరిటీ మార్కెట్లు దీని పరిధిలో ఉన్నాయి. ఇది సెక్యూరిటీ రంగానికి గ్లోబల్ స్టాండర్డ్ సెట్టర్గా నిలిచింది. సెక్యూరిటీ మార్కెట్లను బలోపేతం చేగల ప్రమాణాల తయారీకి ఐయోస్కో జి–20 , ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్ఎస్‌బి) తో కలిసి పనిచేస్తుంది. ఐయోస్కో ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సెక్యూరిటీస్ రెగ్యులేషన్ ఉత్తమ ఆర్థిక వ్యవస్థలకు ముఖ్య ప్రమాణాలలో ఒకటని ఎఫ్ఎస్‌బి ఆమోదించింది.
ఐఓఎస్సీఓ సభ్యత్వం ప్రపంచ స్థాయిలో , ప్రాంతీయ స్థాయిలో ఉమ్మడి ప్రయోజనాలకు కలిగిన సమాచారాన్ని మార్పిడి చేయడానికి ఐఎఫ్ఎస్సీఏకి ఒక వేదికను అందిస్తుంది. ఐఓఎస్సీఓ ఐఎఫ్ఎస్సీఏ ను ఇతర బాగా స్థిరపడిన ఆర్థిక కేంద్రాల నియంత్రణ సంస్థల అనుభవాల నుంచి , ఉత్తమ పద్ధతుల నుంచి నేర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా సెక్యూరిటీ మార్కెట్ల నియంత్రణ సంస్థలతో ఐఎఫ్ఎస్సీఏ ని అనుసంధానించడంలో ఐఓఎస్సీఓ సభ్యత్వం ఒక ముఖ్యమైన మైలురాయి. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్‌లో ఆర్థిక ఉత్పత్తులు, ఆర్థిక సేవలు , ఆర్థిక సంస్థల అభివృద్ధి , నియంత్రణకు ఎంతో దోహదం చేస్తుంది.
***
(Release ID: 1685568)
Visitor Counter : 173