ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల ఉపశమనానికి (ఆర్ఓడీటీఈపీ) పథకం అమలు

प्रविष्टि तिथि: 01 JAN 2021 5:29PM by PIB Hyderabad

ఈ రోజు నుంచి (జనవరి 1, 2021) నుండి ఎగుమతి ఉత్పత్తులపై సుంకం మరియు పన్నుల తొలగింపు (ఆర్ఓడీటీఈపీ) అమలుకు సంబంధించి, డిసెంబర్ 31, 2020 నాటి పత్రికా ప్రకటనకు కొనసాగింపుగా ఈ క్రింది వాటిని త్వరలోనే తెలియజేయ‌డం/ బహిరంగపరచ‌డ‌మ‌వుతుంది.

1. ఆర్ఓడీటీఈపీ పథకానికి అర్హ‌మైన ఎగుమతి వస్తువుల వివరాలు (టారిఫ్ లైన్లు)

2.అటువంటి అర్హతగల వస్తువులు / టారిఫ్ లైన్లలో వర్తించే ఆర్ఓడీటీఈపీ వ‌ర్తించే రేటు, విలువ పరిమితులు (ఎక్క‌డ వ‌ర్తించేవి)

3.ఎగుమతులలో మినహాయింపు వర్గం

4.ఇతర షరతులు మరియు పరిమితులు

5.ఆర్ఓడీటీఈపీ డ్యూటీ క్రెడిట్ మంజూరు మరియు దాని వినియోగానికి సంబంధించిన విధాన వివరాలు.


ఆర్ఓడీటీఈపీ యొక్క ప్రయోజనం షరతులు, పరిమితి, మినహాయింపులు, అనర్హత మరియు నోటిఫై చేసిన విధానపరమైన అవసరాల నెరవేర్పుకు లోబడి లభిస్తుంది. ఎగుమతులపై, స్కీమ్ వివరాల ప్రకారం, ఆర్ఓడీటీఈపీ అర్హత, రేట్లు మరియు ఇతర వివరాలను తరువాత సూచించ‌నునప్పటికీ, రానున్న‌ కొద్ది రోజుల్లో ఆర్ఓడీటీఈపీ ప్రయోజనం 2021 జనవరి 1 నుండి లభిస్తుంది.


 

****


(रिलीज़ आईडी: 1685565) आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Tamil