వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
వినియోగదారుల హక్కుల, ప్రయోజనాల పరిరక్షణ దిశగా పనిని కొనసాగిస్తున్న కేంద్ర వినియోగదారుల పరిక్షణ అథారిటీ
కోవిడ్-19 మహమ్మారి కాలంలో తప్పుదోవపట్టించే, భ్రమింపచేసే ప్రకటనలు ఇచ్చిన కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ
Posted On:
01 JAN 2021 3:17PM by PIB Hyderabad
వినియోగదారుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సిసిపిఎ)ఏర్పాటు చేసినప్పటి నుంచీ సానుకూల చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం కింద వినియోదారులకు అందించిన పరిరక్షణలను సంరక్షణ, వినియోగదారులు అనుభవించే అంశాలను నిరోధించే సమస్యలను తగిన చర్యలను సూచిస్తూ వాటి ప్రభావవంతమైన అమలు కోసం సమీక్షించడం అథారిటీకి సంబంధించి చట్టంలో పొందుపరిచిన విధులలో ముఖ్య విధి.
కోవిడ్-19 మహమ్మారి కాలంలో వివిధ వినియోగదారుల వస్తువులు/ ఉత్పత్తులకు సంబంధించి వారిని తప్పుదోవ పట్టించే విధమైన వివిధ ప్రకటనలు రావడాన్ని పట్టి చూపుతూ, వాటర్ ప్యూరిఫయర్, ఫ్లోర్ క్లీనర్, దుస్తులు, డిస్ ఇన్ఫెక్టెంట్లు, ఫర్నిచర్ తదితర కంపెనీలకు సిసిపిఎ స్వయంగా (suo-moto) షోకాజ్ నోటీసులను జారీ చేసింది. వినియోగదారుల మనోభావాలను చౌక వాణిజ్య లాభాల కోసం దోచుకోవడానికి తప్పదోవ పట్టించే ప్రకటనలను నీతినియమాలు లేని వ్యాపారులను సిసిపిఎ చర్య తప్పనిసరిగా నిరోధిస్తుంది. ఇటువంటి అనుచిత వాణిజ్య పద్ధతులకు పాల్పడిన కాబ్ సముదాయాన్ని అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించవలసిందిగా నోటీసు జారీ చేయడం జరిగింది.
సిసిపిఎ వినియోగదారుల ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించేందుకు సిసిపిఎ పనిని కొనసాగిస్తుంది. జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ అందుకున్న వినియోగదారుల ఫిర్యాదుల విశ్లేషించిన అనంతరం,ఐఎంపిఎస్, యుపిఐ తదితర అంతర్ బ్యాంకింగ్ సేవలు వినియోగించినప్పుడు ఫెయిల్డ్ / కాన్సిల్డ్ ట్రాన్సాక్షన్లలో డబ్బులు వినియోగదారులకు తిరిగిరానప్పుడు లేక చెప్పిన కాలానికి సెటిల్‌మెంట్ చేయాల్సిన క్లెయిములకు కట్టుబడనప్పుడు, సక్టార్ రెగ్యులేటర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ప్రస్తావించి, వినియోగదారుల హక్కులను పరిరక్షించే పనిని సిసిపిఎ చేపట్టింది.
వినియోగదారుల క్లెయిమ్ మొత్తంలో జాప్యం జరుగకుండా, పాలసీదారుల ప్రయోజనాల నిబంధనలు, 2017లో నిర్దేశించిన కాలపరిమితులకు ఇన్సూరెన్స్ కంపెనీలు కట్టుబడి వినియోగదారుల సమస్యలను చేపట్టవలసింది ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయిన ఆర్‌డిఎఐకి సిసిపిఎ సూచించింది.
కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీని 24 జులై, 2020న వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019లోని సెక్షన్ కింద ఏర్పాటు చేశారు. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అవినీతికరమైన వ్యాపార పద్దతులు,వినియోగదారులకు, ప్రజలకు హాని చేసే తప్పుడు, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన వ్యవహారాలను క్రమబద్ధం చేసి, వినియోగదారుల హక్కులను ప్రోత్సహించి, పరిరక్షించి అమలు చేయడం ఈ సంస్థ లక్ష్యం. వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు నిర్వహించి, ఫిర్యాదులను/ దోషారోపణ నియోగించి, సురక్షితం కాని సరుకును, సేవలను వెనక్కి తీసుకోవలసిందిగా ఉత్తర్వులు జారీ చేయడం, అవినీతికరమైన వాణిజ్య పద్దతులను, తప్పుదోవ పట్టించే ప్రకటనలను నిలిపివేయడం, వాటి ఉత్పత్తిదారులు/ ఎండార్సర్లు/ ప‌్రచురణకర్తలపై జరిమానా వేసేందుకు ఈ సంస్థకు అధికారాలు ఉన్నాయి.
***
(Release ID: 1685562)
Visitor Counter : 346