భారత పోటీ ప్రోత్సాహక సంఘం
'ముకంద్ సుమి స్పెషల్ స్టీల్ లిమిటెడ్'లో 51 శాతం ఈక్విటీ వాటా మూలధనాన్ని
'జమ్నాలాల్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్' కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం
Posted On:
31 DEC 2020 11:04AM by PIB Hyderabad
'ముకంద్ సుమి స్పెషల్ స్టీల్ లిమిటెడ్' (ఎంఎస్‌ఎస్‌ఎస్‌ఎల్)లో 51 శాతం ఈక్విటీ వాటా మూలధనాన్ని 'జమ్నాలాల్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్' (జేఎస్‌పీఎల్) కొనుగోలు చేయడానికి 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (సీసీఐ) ఆమోదం తెలిపింది. పోటీ చట్టం-2002లోని సెక్షన్ 31(1) ప్రకారం ఆమోదముద్ర వేసింది.
ముకంద్ లిమిటెడ్ (ముకంద్), నామినీల నుంచి ఎంఎస్ఎస్ఎస్ఎల్ ఈక్విటీ వాటా మూలధనంలో 51 శాతాన్ని జేఎస్‌పీఎల్ పొందడానికి ఈ ప్రతిపాదిత సమ్మేళనం అనుమతిస్తుంది. జేఎస్‌పీఎల్, ముకంద్ ఒకే గ్రూపు సంస్థలు. కనీస వాటా కలిగివుండాలన్న కంపెనీల చట్టం-2013 నిబంధన ప్రకారం, ఎంఎస్‌ఎస్‌ఎస్‌ఎల్‌లో జేఎస్‌పీఎల్ కొంటున్న వాటాల్లో నామమాత్రపు వాటాలను (60కి మించకుండా), జేఎస్‌పీఎల్, కొందరు వ్యక్తులు ఉమ్మడిగా కలిగి ఉంటారు.
జేఎస్‌పీఎల్, బజాజ్ గ్రూపు సంస్థల్లో వాటాలు ఉన్న, నమోదు కాని ముఖ్యమైన పెట్టుబడుల సంస్థ. ఇది ప్రాథమికంగా పెట్టుబడులు, ఆర్థిక సాయం అందిస్తుంది. వస్తు తయారీలోగానీ, వర్తకంలోగానీ లేదు.
ప్రత్యేక, మిశ్రమ ఉక్కు బార్లు, మిశ్రమ వైర్ రాడ్ల తయారీ, మార్కెటింగ్, అమ్మకాలు, పంపిణీ వ్యాపారాలను ఎంఎస్‌ఎస్‌ఎస్‌ఎల్ నిర్వహిస్తోంది. ఈ సంస్థల సమ్మేళనంపై సీసీఐ సవివర ఆదేశం రావాల్సివుంది.
***
(Release ID: 1684995)
Visitor Counter : 155