జల శక్తి మంత్రిత్వ శాఖ

జలశక్తి శాఖ సహాయమంత్రి అరుణాచల్ ప్రదేశ్ లోని పసిఘాట్ వద్ద బ్రహ్మపుత్ర అమంత్రన్ అభియాన్‌లో పాల్గొన్నారు.

Posted On: 30 DEC 2020 8:02PM by PIB Hyderabad

 

అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసిఘాట్ వద్ద బ్రహ్మపుత్ర బోర్డు ఏర్పాటు చేసిన బ్రహ్మపుత్ర అమంత్రాన్ అభియాన్ - రివర్ రాఫ్టింగ్ యాత్ర మరియు బహిరంగ సభలో జల్ శక్తి మరియు సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రత్తన్ లాల్ కటారియా పాల్గొన్నారు. శ్రీ పెమా ఖండు నాయకత్వంలో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బ్రహ్మపుత్ర బోర్డు ప్రారంభించిన ఐఇసి ప్రచారానికి అందించిన సహకారాన్ని మంత్రి ప్రశంసించారు. రాఫ్టింగ్ యాత్ర మరియు రిట్రీచ్ కార్యక్రమం డిసెంబర్ 23 న అరుణాచల్ ప్రదేశ్ వద్ద జెల్లింగ్ నుండి ప్రారంభమైంది. 2021 జనవరి 21 న అస్సాంలోని అస్సామెరాల్గాలో ఇది ముగుస్తుంది. "నదులతో జీవనం" అనే పేరుతో చేపట్టిన ఈ నెలరోజుల కార్యక్రమం బ్రహ్మపుత్ర నదిపట్ల ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో చేపట్టారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో భారతదేశంలోకి ప్రవేశించే ఈ ప్రధాన నది బంగ్లాదేశ్‌లోకి  ప్రవేశించే ముందు అస్సాం గుండా ప్రవహిస్తుంది. అక్కడ గంగా నదితో కలిసి బంగాళాఖాతంలో కలుస్తుంది.

ఈ కార్యక్రమంలో శ్రీ కటారియా.. ఐఐటి గువహతి, ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు, నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ షిల్లాంగ్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ గౌహతి, శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు జల్ శక్తి మంత్రాలయ ప్రయత్నాల గురించి వివరించారు. ఇంటిగ్రేటెడ్ విధానాన్ని అవలంబించడం ద్వారా నీటి సంబంధిత సమస్యలను పరిష్కరించడంపై ప్రసంగించారు. 2019 లో మంత్రిత్వ శాఖ అమలు చేసిన గంగా అమంత్రాన్ అభియాన్‌కు వచ్చిన ఆశ్చర్యకరమైన స్పందన వచ్చిందని దాంతో బ్రహ్మపుత్ర అమంత్రాన్ అభియాన్ చేపట్టామని ఆయన తెలియజేశారు. ప్రభుత్వ నమామి గంగే ప్రోగ్రాం కింద జరుగుతున్న పనుల గురించి ఆయన కార్యక్రమంలో పాల్గొన్న వారికి వివరించారు.

నదులు మరియు మానవ నాగరికత మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని శ్రీ కటారియా వివరించారు. చారిత్రాత్మకంగా భూమి మీద ఉన్న అన్ని నాగరిక సమాజాలు జీవితానికి ప్రధాన వనరుగా ఉన్నందున నదులతో పాటు ఉద్భవించాయి. అయినప్పటికీ జనాభా పెరుగుదల మరియు పట్టణీకరణ కారణంగా మన నదీ వ్యవస్థలపై ఒత్తిడి పెరిగింది. కాలుష్యం యొక్క తీవ్రమైన సమస్యను కూడా ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే వివిధ పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు ఎటువంటి ఫిల్టరేషన్ లేకుండా నదుల్లో కలిసిపోతున్నాయి. మన నదులను కాలుష్య కోరలనుండి విడిపించేందుకు అందరూ కట్టబడి ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. “నిర్మల్టా” మరియు “అవిరాల్టా” వైపు పనిచేయాలని శ్రీ కటారియా పాల్గొన్న వారందరినీ అభ్యర్థించారు. నది పరిరక్షణ మరియు అభివృద్ధి ఒకదానికొకటి పూర్తి అయ్యేలా చూసుకోవటానికి "నది సమకాలీకరించబడిన అభివృద్ధి" అనే భావనపై ఆయన ఉద్ఘాటించారు. అవగాహన కార్యక్రమం మరియు బ్రహ్మపుత్ర బోర్డు నిర్వహించిన వివిధ పోటీలలో పాల్గొన్నందుకు విద్యార్థులకు అవార్డులు పంపిణీ చేశారు. బ్రహ్మపుత్ర బోర్డు  చైర్మన్ శ్రీ రాజీవ్ యాదవ్, కార్యదర్శి ఎస్ వి.డి రాయ్, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పరివాహక ప్రాంతాల్లో కోత మరియు వరదలకు ఈ నది కారణమైంది. అందువల్ల నదులతో నివసించే ఇతివృత్తం, ఈ ప్రాంతంలో జీవన వనరుగా పనిచేసే ప్రజలకు మరియు బ్రహ్మపుత్ర నదికి మధ్య ఉన్న సంబంధాన్ని తిరిగి పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆంశం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం చేపట్టిన రాఫ్టింగ్. అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాల గుండా వెళుతున్న బ్రహ్మపుత్ర నది వెంట ఈ రాఫ్టింగ్ సాగుతుంది. నదీ తీర నగరాలు మరియు పట్టణాల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమం నిర్వహించబడుతుంది.

***



(Release ID: 1684952) Visitor Counter : 70


Read this release in: English , Urdu , Hindi , Manipuri