విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ప్రతిష్టాత్మకమైన సీఐఐ-ఐటీసీ స‌స్ట‌యిన‌బిలిటీ అవార్డ్స్ 2020 గెలుచుకున్న ఎన్‌టీపీసీ

Posted On: 23 DEC 2020 5:33PM by PIB Hyderabad

దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిదార‌యిన‌ ఎన్‌టీపీసీ లిమిటెడ్ సంస్థ‌కు కార్పొరేట్ సామాజిక బాధ్య‌త (సీఎస్ఆర్) డొమైన్‌లో ప్రతిష్టాత్మక సీఐఐ-ఐటీసీ సస్టైనబిలిటీ అవార్డ్స్- 2020 లభించింది. సీఎస్ఆర్ విభాగం కార్పొరేట్ ఎక్సలెన్స్ కేటగిరీలో ఎన్‌టీపీసీని అవార్డుతో సత్కరించారు. ఈ విభాగంలో సంస్థ గణనీయమైన సాధనకు ప్రశంసగా అవార్డును అంద‌జేశారు. వర్చువల్ వేదిక‌గా
జరిగిన 15వ సీఐఐ-ఐటీసీ సస్టైనబిలిటీ అవార్డ్స్ - 2020 కార్య‌క్ర‌మంలో సంస్థ డైరెక్ట‌ర్(హెచ్ఆర్‌) శ్రీ డి.కె. పటేల్, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ స‌హాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ సమక్షంలో మేటి గుర్తింపును సంస్థ త‌ర‌పున‌ అందుకున్నారు. సీఎస్ఆర్ డొమైన్‌లో సీఐఐ-ఐటీసీ అందించే అతి ఉన్న‌తపు పురస్కారం ఇది. కార్పొరేట్ ఎక్సలెన్స్ విభాగంలో ఈ అవార్డును అందుకున్న ఏకైక ప్ర‌భుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ. కార్పొరేట్ ఎక్సలెన్స్ విభాగంలో ప్రతిష్టాత్మక సీఐఐ-ఐటీసీ సస్టైనబిలిటీ అవార్డులను ఎన్‌టీపీసీ  వరుసగా రెండవసారి గెలుచుకుంది. అంత‌కుముందు 2019లో ఇప్ప‌డు 2020 సంవత్సరంల సంస్థ ఈ అవార్డును అందుకుంది.

                                   

***



(Release ID: 1683199) Visitor Counter : 137