ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

కొవిడ్ వాక్సిన్ వ్యవస్థ 'కో విన్' పటిష్ట నిర్వహణా వ్యవస్థ రూపకల్పనకు పోటీ -- ప్రకటించిన ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్


Posted On: 23 DEC 2020 5:24PM by PIB Hyderabad

దేశవ్యాపితంగా కోవిద్ వాక్సిన్ సక్రమ, పటిష్ట పంపిణీ కోసం రూపొందిన డిజిటల్ వేదిక 'కో విన్'

పోటీ ద్వారా 'కో విన్' ను మరింత పటిష్టం చేయడానికి నూతన సాంకేతిక ఔత్సాహికులు, నిపుణులకు ఆహ్వానం

​నుంచి జనవరి 15 వరకుhttps://meitystartuphub.in లో నమోదుకు అవకాశం

హైదరాబాద్ , డిసెంబర్ 23: దేశవ్యాపితంగా కొవిడ్ వాక్సిన్ ను పంపిణీ చేయడానికి 'కో విన్' పేరిట పటిష్ట నిర్వహణా వ్యవస్థకు రూపకల్పన చేయాలని కోరుతూ సాంకేతిక ఔత్సాహికులు, నిపుణుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. 'కో విన్' పోటీని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో కలసి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పోటీని నిర్వహించాలని నిర్ణయించింది. కొవిడ్ వాక్సిన్ ను దేశవ్యాపితంగా పంపిణీ చేయడానికి వ్యవస్థను రూపొందించడానికి ఈ పోటీని నిర్వహించాలని నిర్ణయించారు. " కొవిడ్-19ని ఎదుర్కోడానికి అమలు చేసిన కార్యక్రమంలో ఔత్సాహిక ఆవిష్కర్తలు కీలక పాత్ర పోషించారు. కొవిడ్ 19 వాక్సిన్ ను ఇవ్వడానికి రంగం సిద్ధం అవుతోంది. దీనికోసం దేశవ్యాపితంగా ఒక పటిష్ట వ్యవస్థను రూపొందించవలసి ఉంటుంది. దీనికోసం ఔత్సాహిక ఆవిష్కర్తలు ముందుకు వచ్చి పోటీ పడాలని నేను కోరుతున్నాను'అని రవిశంకర్ తెలిపారు.

ఎం ఎస్ హెచ్ పోర్టల్ లో ప్రారంభం అయ్యే ఈ పోటీలో పటిష్టంగా వినూత్నంగా 'కో విన్'వ్యవస్థను రూపొందించే అంశంలో ఔత్సాహిక ఆవిష్కర్తలు, సాంకేతిక నిపుణుల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ పోటీని నిర్వహించనున్నది. ఎటువంటి లోపాలు లేకుండా సమగ్రమైన పంపిణీ వ్యవస్థను రూపొందించడానికి ఏడు అంశాలను సాంకేతిక సహకారంతో రూపకల్పన చేయవలసి ఉంటుందని గుర్తించారు. మౌలిక వ్యవస్థ రూపకల్పన, పర్యవేక్షణ, నిర్వహణ, నూతన అంశాలు, మానవ వనరుల కొరత లాంటి అంశాలలో సాంకేతికతను జోడించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో పాటు వాక్సిన్ ఎవరికి ఇవ్వాలి, ఇచ్చిన తరువాత ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడం లాంటి అంశాలకు కూడా సాంకేతిక సహకారం అవసరం ఉంటుందని గుర్తించిన ప్రభుత్వం ఈ పోటీని నిర్వహించాలని నిర్ణయించింది.

పోటీలో పాల్గొనే వారు తొలుత తమ వివరాలను 2020 డిసెంబర్ 23వ తేదీ నుంచి 2021 జనవరి 15 వరకు https://meitystartuphub.inలో నమోదు ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. దీనిలో తొలి అయిదు స్థానాలలో నిలిచేవారికి వేదిక ద్వారా తమ పరిష్కారాలను అందచేయడానికి 'కో విన్' ఏ పి ఐ లను అందిస్తారు. ఈ దశలో ఎంపిక అయిన ధరఖాస్తుదారుడు రెండు లక్షల రూపాయల వరకు గెలుచుకోడానికి అవకాశం ఉంటుంది. అనుసంధానం చేయబడిన పరిష్కార మార్గాలను మరింతగా పరిశీలించి వాటిని ఏ మేరకు అమలు చేయవచ్చును, వాటివల్ల ఈమేరకు ప్రయోజనం కలుగుతుంది అన్న అంశాలను మదింపు వేస్తారు. విజయవంతంగా అమలు చేయవచ్చునని ఎంపిక అయి తొలి రెండు స్థానాలలో నిలిచేవారికి 40 లక్షలు 20 లక్షల చొప్పున బహుమతిగా అందించడం జరుగుతుంది.

***


(Release ID: 1683190)