వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఆగ్నేయ ఆసియా దేశానికి వ్యవసాయ మరియు శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ కోసం అపెడా ఆ ప్రాంతంలో ఉన్న థాయిలాండ్‌తో వర్చువల్ గా కొనుగోలుదారు- అమ్మకందారుల సమావేశాన్ని నిర్వహించింది
బ్యాంకాక్‌లో ‘టేస్ట్ ఆఫ్ ఇండియా’ ప్రచారం

Posted On: 22 DEC 2020 5:05PM by PIB Hyderabad

భారతదేశ వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల- ఎగుమతి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో, అపెడా 2020 డిసెంబర్ 21 న థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయంతో కలిసి వర్చువల్ కొనుగోలుదారు అమ్మకందారుల సమావేశాన్ని (బిఎస్ఎం) నిర్వహించింది. ఈ సమావేశం ఆయా ప్రభుత్వాలు, వాణిజ్య రంగం నుండి ముఖ్య వాటాదారులను ఒక దగ్గరకు తెచ్చింది. అగ్రి ఫుడ్ సెక్టార్లో భారతదేశం మరియు థాయిలాండ్ మధ్య వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక సాధారణ వేదిక భాగస్వామ్యం కలిపించింది. 

 

వివిధ దేశాలతో APEDA నిర్వహించిన ఇటువంటి కార్యక్రమాల శ్రేణిలో థాయ్‌లాండ్‌తో ఈ వర్చువల్- బిఎస్ఎం 13వ సమావేశం. ఇంతకుముందు ఇటువంటి వర్చువల్-బిఎస్ఎమ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), కువైట్, ఇండోనేషియా, స్విట్జర్లాండ్, బెల్జియం, ఇరాన్, దక్షిణాఫ్రికా, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియాతో నిర్వహించారు

ద్రాక్ష, దానిమ్మ, కూరగాయలు, పాల ఉత్పత్తులు మరియు ఇతర రెడీ టు ఈట్ వంటి ఉత్పత్తులు థాయ్‌లాండ్‌కు ఎగుమతుల కోసం ఉన్న అవకాశాలపై భారతదేశం నుండి వాణిజ్య సంఘాలు వర్చువల్-బిఎస్ఎమ్ సందర్బంగా ప్రదర్శన ఇచ్చాయి. థాయిలాండ్ ట్రేడ్ అసోసియేషన్లు, దిగుమతిదారులు భారతదేశం నుండి వ్యవసాయ దిగుమతుల కోసం వారి అవసరం, ప్రమాణాలను వివరించారు

వర్చువల్ బిఎస్ఎంలో థాయిలాండ్ భారత రాయబారి శ్రీమతి సుచిత్రా దురై, అపెడా  చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, డైరెక్టర్ బోర్డ్ ఆఫ్ ట్రేడ్ మరియు థాయ్ ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజిట్ లిమ్లూర్చా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్,  ఫెడరేషన్ ఆఫ్ థాయ్ ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్ శ్రీమతి పాఫావీ సుతావివత్ , అపెడా మరియు ఎంబసీ ఆఫ్ ఇండియా, థాయిలాండ్ కి చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వర్చువల్ బిఎస్ఎమ్ తరువాత బ్యాంకాక్లో ‘టేస్ట్ ఆఫ్ ఇండియా’ ప్రచారం జరిగింది. అపెడా  పంపించిన భారతీయ ద్రాక్ష, దానిమ్మ, దానిమ్మపండు, కూరగాయలు, పాల ఉత్పత్తులు మరియు ఇతర రెడీ టు ఈట్ ఉత్పత్తులను ప్రదర్శించారు. టేస్ట్ ఆఫ్ ఇండియా ప్రచారంలో బాస్మతి రైస్ బిర్యానీ, తాజా ద్రాక్ష, దానిమ్మపండు నమూనా కూడా ప్రదర్శించారు. సందర్శకులు బిర్యానీ తయారీని, దానిమ్మ, ద్రాక్షలను రుచులను ఆస్వాదించారు

 

కొనసాగుతున్న కోవిడ్ 19 మహమ్మారి కారణంగా, ఎగుమతి ప్రోత్సాహకర కార్యక్రమాన్ని భౌతికంగా నిర్వహించడం సాధ్యం కాలేదు. భారతదేశం మరియు థాయిలాండ్ ఎగుమతిదారులు మరియు దిగుమతిదారులకు ఒక వేదికను అందించడానికి వర్చువల్ బిఎస్ఎం  ను నిర్వహించడానికి అపెడా  ముందడుగు వేసింది. 

 

*****(Release ID: 1682866) Visitor Counter : 8