ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
విపత్తు నివారణ మౌలిక సదుపాయాల (సిడిఆర్ఐ) మరియు విపత్తు ప్రమాద తగ్గింపు (యుఎన్ డిఆర్ ఆర్ ) కూటమి సమావేశంలో ప్రసంగించిన డాక్టర్ హర్ష వర్ధన్
Posted On:
17 DEC 2020 8:05PM by PIB Hyderabad
"మేము సామర్థ్యాలను అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల పరిశోధనా విభాగాల సహకారంతో పెంపొందించుకున్నాము. నుంచి మా విస్తృతమైనలో తిరిగి తీసుకున్నాము. మెరుగైన సామర్థ్యంతో ఆసుపత్రులను త్వరగా నిర్మించడానికి మేము రక్షణ పరిశోధన సామర్థ్యాలను పొందాము. . మహమ్మారికి ముందు పిపిఇల దిగుమతిదారుగా ఉన్న భారతదేశం ఇప్పుడు పిపిఇల నికర ఎగుమతిదారుగా మారింది. "
హైదరాబాద్, డిసెంబర్ 17:
విపత్తు నివారణ మౌలిక సదుపాయాల (సిడిఆర్ఐ) మరియు విపత్తు ప్రమాద తగ్గింపు (యుఎన్ డిఆర్ ఆర్ ) కూటమి ఈ రోజు సక్రమ నిర్మాణం: ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన మరియు సరఫరా' అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మంత్రి విపత్తు నివారణ కోసం ఐక్యరాజ్య సమితికి చెందిన విపత్తు నివారణ మౌలిక సదుపాయాల (సిడిఆర్ఐ) మరియు విపత్తు ప్రమాద తగ్గింపు (యుఎన్ డిఆర్ ఆర్ ) కూటమి చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరియు సరఫరా గొలుసులను మరింత పటిష్టంగా రూపొందించడానికి అమలు చేయవలసిన చర్యలపై సమావేశాన్ని నిర్వహించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశంలో కొవిడ్ వల్ల ఏర్పడిన పరిస్థితిని ప్రస్తావించిన మంత్రి దాదాపు సంవత్సర కాలంగా కొవిడ్ -19 ప్రభావం చూపిస్తున్నదని అన్నారు. ప్రపంచంలో కొవిడ్ ప్రభావం తగ్గుతున్నప్పటికీ కొన్ని దేశాలలో వ్యాధి రెండు మరికొన్ని దేశాలలో మూడవ దశలోకి ప్రవేశించిందని అన్నారు. అదృష్టవశాత్తూ, భారతదేశంలో, కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ముప్పును ముందుగానే గుర్తించి పరిస్థితిని ఎదుర్కోడానికి మేము శాస్త్రీయవిధానాలను అనుసరించామని మంత్రి వివరించారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎదురైన సంక్షోభాన్నిఎదుర్కోడానికి భారతదేశం తీసుకున్న చర్యలను వివరించిన డాక్టర్ వర్ధన్ " పరీక్షలు , పిపిఇ ఉత్పత్తి మరియు ఆసుపత్రి పడకల సంఖ్యను ఎక్కువ చేయడానికి తొలి ప్రాధాన్యతను ఇచ్చాము. మేము సమస్య మూలకోణాలను గుర్తించి అత్యంత వేగంగా స్పందించాము.' అని వివరించారు.
కొవిడ్ ను ఎదుర్కోడానికి రూపొందించిన వ్యవస్థను ప్రస్తావించిన మంత్రి ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో మౌలిక సౌకర్యాలను పెంపొందించుకుని ఆస్పత్రులలో సౌకర్యాలను కల్పించామని అన్నారు. కొవిడ్ కు ముందు పిపిఇ కిట్లను దిగుమతి చేసుకున్న భారతదేశం ఇప్పుడు వాటిని ఎగుమతి చేయగల సామర్ధ్యాన్ని సంపాదించింది అన్నారు. పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచామని తెలిపారు. ఒక సమయంలో రోజుకి వందల సంఖ్యలో జరిగిన పరీక్షలు ఆ తరువాత వేల సంఖ్యలో జరిగాయని అన్నారు. పరిస్థితిని ఎదుర్కోడానికి భారతీయ సంస్థలు చేసిన కృషి కలకాలం గుర్తుంటుందని అన్న మంత్రి వీటిని ప్రతి ఒక్కరూ ప్రశంసించాలని అన్నారు.
కొవిడ్ ను ఎదుర్కొనే అంశంలో సమాచార వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని మంత్రి వివరించారు. "మేము ప్రతి ఒక్కరినీ సమీకరించటానికి సాధ్యమైన ప్రతి మార్గాన్ని ఉపయోగించాము. గౌరవనీయ ప్రధాని స్వయంగా ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించి ప్రజలతో నేరుగా మాట్లాడారు. సహకార సమాఖ్యవాదం యొక్క స్ఫూర్తితో ప్రతి దశలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేశాయి. "అని మంత్రి తెలిపారు.
కొవిడ్-19 ని ఎదుర్కోవటానికి బహుళస్థాయి విధానం అవసరమని చెప్పిన మంత్రి " కొవిడ్ -19 ను ఎదుర్కోవడంలో ఆరోగ్య రంగం ముందంజలో ఉండాలని మేము ముందుగానే గుర్తించాము. దీనికి అన్ని ప్రభుత్వవిభాగాలు - విపత్తు నిర్వహణ, పరిశ్రమ, పౌర విమానయానం, షిప్పింగ్, ఫార్మాస్యూటికల్స్, మరియు పర్యావరణం మొదలైనవి.కలసి పనిచేయవలసి గుర్తించిన ప్రభుత్వం దీనికోసం వ్యవస్థలు పరస్పర సహకారంతో పనిచేసేలా చూడడానికి వ్యవస్థను ఏర్పాటు చేసిందని మంత్రి వివరించారు.
"మేము వ్యాధిని ట్రాక్ చేయడానికి, పర్యవేక్షించడానికి మరియు నియంత్రించడానికి అనేక రకాల డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినూత్నంగా ఉపయోగించాము. భారతదేశం వంటి దేశంలో - పెద్ద డిజిటల్ విభజనతో - ఎవరూ వెనుకబడిపోకుండా ఉండటానికి మేము వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను సమర్ధంగా వినియోగించాము' అని ఆయన వివరించారు.
డాక్టర్ వర్ధన్ మాట్లాడుతూ, "విపత్కర సమయంలో ప్రపంచంలోని అనేక దేశాలలో అభివృద్ధి చేయబడిన కొన్ని మంచి పద్ధతులు సంస్థాగతీకరించాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. భవిష్యత్తులో వీటిని మనం తిరిగి ఆవిష్కరించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మనం వీటిని మరింత సమర్ధంగా ఎలా వినియోగించగలం అనే అంశాన్ని ఆలోచించాలి. ప్రజారోగ్య మౌలిక సదుపాయాల సందర్భంలో "మెరుగైన నిర్మాణాన్ని" అర్థం చేసుకోవడానికి మరింత లోతుగా చర్చలు జరగాలి. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని సాంప్రదాయ జ్ఞానంతో ఎలా మిళితం చేస్తాము? "ఆరోగ్య మౌలిక సదుపాయాలను" ఎలా నిర్వచించాలి? ఇది పెద్ద ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు మరియు ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల భాద్యత మాత్రమేనా ? లేదా నీరు మరియు పారిశుధ్యం, సాంఘిక సంక్షేమం, రవాణా మరియు పరిశ్రమలతో సహా ఇతర రంగాలతో కూడిన మొత్తం వ్యవస్థఏర్పడాలా ?ఈ అంశాలపై విస్తృత చర్చ జరగాలి' అని మంత్రి పేర్కొన్నారు.
ప్రపంచవ్యాపితంగా విపత్తు నివారణ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసిన మంత్రి "గత దశాబ్దాలుగా, భారతదేశం మరియు ప్రపంచ దేశాలు ఆర్థిక మరియు మానవ అభివృద్ధిలో అపూర్వమైన పురోగతిని సాధించాయి.అయితే కొవిడ్ -19 చూపించినట్లుగా, మన వ్యవస్థలను పటిష్టం చేయని పక్షంలో సాధించిన పురోగతి అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారుతుంది. దేశాలు మరియు అంతర్జాతీయ సమాజంగా ఆర్థిక వృద్ధి కోసం అనుసరించే విధానాలు, సూత్రాలు సమగ్రంగా ఉండాలి. మన జీవితాలు మరియు జీవనోపాధి దానిపై ఆధారపడి ఉండవచ్చు.దీనిని దృష్టిలో ఉంచుకుని వాతావరణ మార్పుల వల్ల వచ్చే ప్రమాదాలతో సహా ప్రమాదాలను ముందుగానే ఊహించి వాటిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని కొవిడ్ నేర్పిన గుణపాఠాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి వ్యవస్థలకు రూపకల్పన చేయక తప్పదు'అని మంత్రి అన్నారు.
"ప్రపంచ ప్రజల ప్రపంచ వ్యాపితంగా చర్చ ప్రారంభం కావాలి. ఇది తమ వ్యక్తిగత భద్రత కంటే ప్రపంచ భద్రతకుప్రాధాన్యత ఇచ్చి పనిచేసిన వారికి ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు, అత్యవసర ప్రతిస్పందనదారులు, ఫ్రంట్ లైన్ కార్మికులకు ఇది అత్యంత విలువైన నివాళిగా ఉంటుంది " డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు.
***
(Release ID: 1681620)
Visitor Counter : 207