రక్షణ మంత్రిత్వ శాఖ
భారత్- మాల్దీవుల మధ్య రక్షణ సహకారంపై గురువారం జరిగిన వెబినార్, ఎక్్సపో
Posted On:
17 DEC 2020 6:12PM by PIB Hyderabad
భారత్, మాల్దీవుల మధ్య వెబినార్, ప్రదర్శనను గురువారం నిర్వహించారు. వెబినార్ ఇతివృత్తం ఇండో మాల్దీవుల ఉన్నత స్థాయి రక్షణ ఒప్పందం. ఈ కార్యక్రమాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్్స ప్రొడక్షన్ (డిడిపి), రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్్స అండ్ ఇండస్ట్రీ ద్వారా జరిగింది.
ఈ వెబినార్ ఎయిరో ఇండియా 21 సిరీస్ వెబినార్లలో భాగం. దీనిని మిత్ర విదేశీ దేశాలతో రక్షణ సహకారం, ఒప్పందాలను పెంచేందుకు, ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్నారు.
ఇరు పక్షాలు కూడా తమ దేశాల మధ్య సన్నిహిత, స్నేహపూర్వక, బహుముఖ సంబంధాల గురించి మాట్లాడాయి. మాల్దీవులలో భారత్‌కు ముఖ్య స్థానం ఉందని, ముందు పొరుగువారు అన్న ప్రభుత్వం విధానం కారణంగా, స్థిరమైన, సౌభాగ్యవంతమైన, శాంతియుతమైన మాల్దీవుల అభివృద్ధి దేశం కట్టుబడి ఉంటుందని, అదనపు కార్యదర్శి (డిపి) సంజయ్ జాజూ అన్నారు.
ప్రభుత్వ ప్రధాన పథకమైన మేకిన్ ఇండియా చొరవ ద్వారా భారత్‌లో పరిస్థితులు ఆత్మనిర్భర్ భారత్ అన్న స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు వేగంగా పురోగమిస్తున్నాయని, జాజూ చెప్పారు. స్వయంసమృద్ధ భారత్ లేక ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం అంతర్గత దృష్టిని కలిగిన కార్యక్రమనని, కానీ అది ప్రపంచ పరిస్థితులు, వాతావరణంతో భారత్ సమగ్రమయ్యే పరిస్థితులను సృష్టించనుందన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తుల తయారీ కేవలం దేశీయ అవసరాలకే కాదని, ప్రపంచ అవసరాలను కూడా తీర్చడానికని, ముఖ్యంగా మాల్దీవులు సహా మిత్రదేశాల కోసమని ఆయన వివరించారు.
వెబినార్‌లో ఎంఎన్‌డిఎఫ్ తమ అవసరాలకు సంబంధించిన వివరణాత్మక ప్రెజెంటేషన్ ఇవ్వగా, భారత్ ఎలక్ట్రానిక్్స లిమిటెడ్, మాజాగాన్ డాక్ షిప్ బిల్డర్్స లిమిటెడ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టంస్ లిమిటెడ్ (టిఎఎస్ ఎల్), మహీంద్రా డిఫెన్్స లిమిటెడ్, ఎంకెయు లిమిటెడ్, ఎస్ ఎంపిపి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్, లార్సన్ &టబ్రో, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజినీర్స్ లిమిటెడ్ వంటి 11 భారతీయ రక్షణ కంపెనీలు తమ సామర్ధ్యాలను, అందిస్తున్న ఉత్పత్తులను, పరిష్కారాలను ప్రముఖంగా పేర్కొన్నాయి.
మాల్దీవుల జాతీయ రక్షణ దళం (ఎంఎన్‌డిఎఫ్), రక్షణ దళాల అధిపతి మేజర్ జనరల్ అబ్దుల్లా షమాల్, మాల్దీవులకు భారత హైకమిషనర్ సంజయ్ సుధీర్, ఇరు దేశాలకు చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. ఈ వెబినార్‌లో 375మందికి పైగా పాల్గొనగా, ప్రదర్శనలో 41 వర్చువల్ ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ప్రదర్శించారు.
(Release ID: 1681617)
Visitor Counter : 207