మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
డిసెంబర్ 18 నుంచి 27వరకు రామ్‌పూర్ (యుపి)లో హునార్ హాట్ నిర్వహణ
నైపుణ్యం కలిగిన చేతివృత్తి పనివారల దేశీయ ఉత్పత్తులు రామ్‌పూర్‌లోని హునార్ హాట్‌లో ప్రధాన ఆకర్షణః ముక్తార్ అబ్బాస్ నక్వీ
జాన్ భీ, జహాన్ భీ అన్న ఇతివృత్తంతో ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన
ఆత్మనిర్భర్ భారత్ ఇతివృత్తంతో డిసెంబర్ 27న కవిసమ్మేళనం
నాడు పోస్టు చేయడమైనది:
17 DEC 2020 12:45PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా, హైవేలు, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ దేశీయ చేతివృత్తి నిపుణులకు చెందిన 23వ హునార్ హాట్ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రదర్శన రామ్‌పూర్ (యుపి)లోని పనవాదియాలోని నుమాయిష్ గ్రౌండ్‌లో శుక్రవారం (18 డిసెంబర్, 2020) నుంచి ప్రారంభకానుంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, ఎమ్ ఎస్ ఎంఇ మంత్రి సిద్దార్థనాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
రామ్‌పూర్‌లో డిసెంబర్ 18 నుంచి 27 డిసెంబర్,2020 వరకు నిర్వహిస్తున్న హునార్ హాట్‌లో నైపుణ్యం కలిగిన చేతివృత్తులవారి దేశీయ ఉత్పత్తులు ప్రధాన ఆకర్షణ అని నక్వీ చెప్పారు. అంతే కాకుండా దేశం నలుమూలలకు చెందిన సంప్రదాయ వంటకాలను ప్రజలు హునార్ హాట్‌లో రుచి చూడనున్నారన్నారు. అంతేకాకుండా, జాన్ భీ, జహాన్ భీ అన్న ఇతివృత్తంతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతిరోజూ ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు మరొక ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దేశపు భిన్నత్వంలో ఏకత్వ భావనను, మత సామరస్యపు సజీవ భావనను హునార్ హాటల్ అనుభవించే సందర్భమన్నారు. ఇందులో భాగంగా 27 డిసెంబర్ 2020న ఆత్మ నిర్భర్ భారత్ అన్న ఇతివృత్తంతో కవిసమ్మేళనం జరుగనుంది.
ఈ ప్రదర్శనలో ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, నాగాలాండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, బీహార్, ఆంధ్ర ప్రదేశ్, జార్ఖండ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, లడాఖ్, కర్నాటక, గుజరాత్, హర్యానా, జమ్ము-కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కేరళతో పాటుగా దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన నైపుణ్యం కలిగిన చేతివృత్తిపనివారు, శిల్పలు కళాకారులు చెక్క, ఇత్తడి, వెదురు, గాజు, నేత, కాగితం, బంకమట్టి తదితర పదార్ధాలతో చేసిన దేశీయ ఉత్పత్తులను తీసుకువచ్చారని నక్వీ వివరించారు.
***
(రిలీజ్ ఐడి: 1681590)
సందర్శకుల సూచీ సంఖ్య : : 147