ఆయుష్
ఉత్తరాఖండ్‌లో 200 ఆయుష్ హెల్త్ & వెల్‌నెస్ సెంటర్లకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదం
Posted On:
15 DEC 2020 4:07PM by PIB Hyderabad
కేంద్ర ప్రాయోజిత పథకం జాతీయ ఆయుష్ మిషన్ (నామ్) కింద 200 ఆయుష్ ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలను (హెల్త్ & వెల్‌నెస్ సెంటర్లకు) ఉత్తరాఖండ్‌లోని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదాన్ని తెలిపింది.
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఆయుష్ హెచ్‌డబ్ల్యూసీల నిర్వహణకు గాను న్యూఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న అరవింద్ లాల్ వందన లాల్ (ఏఎల్‌వీఎల్) ఫౌండేషన్ శాఖ ఉత్తరాఖండ్‌లోని ఆయుష్ విభాగానికి సహకారాన్ని అందిస్తోంది.
దీనికి సంబంధించి ఈ నెల 10వ తేదీన (2020 డిసెంబర్ 10న) భాగస్వాములు త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయుష్ శాఖ కార్యదర్శి, ఆయుష్ శాఖ జాయింట్ సెక్రటరీ (ఆయుష్), ఉత్తరాఖండ్ ఆయుర్వేద విభాగం డైరెక్టర్, ఏఎల్‌వీఎల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అరవింద్ లాల్ హాజరయ్యారు. ఈ కేంద్రాలలో కార్యకలాపాలను నిర్వహిచేందుకు, ప్రణాళిక, అమలు మరియు ఇతర అవసరమైన సహాయాన్ని అందించే మొత్తం బాధ్యత ఉత్తరాఖండ్ రాష్ట్రప్రభుత్వానికి ఇవ్వబడింది. కేంద్ర ప్రభుత్వం అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. జనాభా గణనలో
ఏఎల్‌వీఎల్ ఫౌండేషన్ హెచ్‌డబ్ల్యూసీల పరిధిలోని జనాభాకు సంబంధించిన.. ఆరోగ్య కార్డుల ఏర్పాటు, హెచ్‌డబ్ల్యూసీ బృందం శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. కేంద్ర ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల కార్యాచరణ మార్గదర్శకంలో సమగ్ర ప్రాథమికంగా ఆరోగ్య సంరక్షణ అందించడంలో ఆరోగ్యానికి పర్యావరణాన్ని మెరుగుపరచడానికి గాను ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలతో భాగస్వామ్యం చేసుకోవచ్చని ఒక నిబంధన ఉంది. దేశవ్యాప్తంగా 2023-2024 నాటికి దశల వారీగా 12,500 ఆయుష్ ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలను నిర్వహణలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
***
(Release ID: 1680931)
Visitor Counter : 136