ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక స్థిరత, అభివృద్ధి మండలి 23వ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Posted On:
15 DEC 2020 5:03PM by PIB Hyderabad
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం జరిగిన ఆర్థిక స్థిరత, అభివృద్ది మండలి (ఫైనాన్షియల్ స్టెబులిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ -ఎఫ్ ఎస్ డిసి) 23 సమావేశానికి కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశానికి దృశ్య మాధ్యమం ద్వారా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఆర్థిక కార్యదర్శి డాక్టర్ అజయ్ భూషణ్ పాండే, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్నే, ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండే, కార్పరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి (ఇన్‌ఛార్జి) తుహిన్ కాంత పాండే, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శక్తికంఠ్ దాస్, ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి వి. సుబ్రమణియన్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ అజయ్ త్యాగి, ఇన్సూరెన్్స రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ సుభాష్ చంద్ర కుంతియా, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్‌పర్సన్ సుప్రతిమ్ బంద్యోపాధ్యాయ్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్ట్సీ బోర్్డ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ డాక్టర్ ఎం. ఎస్. సాహూ, అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అథారిటీ చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్, ఆర్థిక రంగ నియంత్రణ, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

సమావేశం ప్రధానంగా స్థూల ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వ సమస్యల (ప్రపంచ, దేశీయ) ను, దుర్బలత్వానికి సంబంధించిన సమస్యలపై ప్రత్యేక దృష్టితో సమీక్షించి, భారత ప్రభుత్వం, ఆర్థిక రంగ నియంత్రణ అథారిటీలు తీసుకున్న విధానపరమైన చర్యలు, 2020-21 రెండవ త్రైమాసికానికి సంబంధించి జిడిపి సంకోచాన్ని తగ్గించడం ప్రతిఫలించినట్టుగా వేగవంతమై ఆర్థిక పునరుద్ధరణ జరిగేలా బలోపేతం చేశాయని సమావేశం పేర్కొంది. ఆర్థిక రంగం పుంజుకుందని, గతంలో పేర్కన్నదానికన్నా వేగవంతంగా కోలుకునే మార్గంలో ఉంటుంది. ఆర్థిక రంగం వేగవంతమైన నిజ ఆర్థిక వృద్ధిని పుంజుకునేలా, స్థూల ఆర్థిక లక్ష్యాలను ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే సాధించడానికి నిరంతర మద్దతు ఇచ్చేందుకు అవసరమైన చర్యలపై చర్చ నిర్వహించారు. ఆర్‌బిఐ, ఇతర రెగ్యులేటర్లు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలను కూడా కౌన్సిల్ చర్చించింది.
దీర్ఘ, మధ్యకాలిక ఆర్థిక బలహీనతలను బహిరంగపరచగల ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం, రెగ్యులేటర్లందరూ కూడా నిరంతర అప్రమత్తతతో ఉండాలని కూడా నిర్ణయించారు.
కాంట్రాక్టుల ఆధారంగా లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ ( ) సాఫీ పరివర్తనలో ఉన్న సవాళ్ళను మండలి చర్చించడమే కాక, ఈ వ్యవహారంలో సంబంధిత వ్యవస్థ, శాఖ భాగస్వాములను కలుపుకుని బహుముఖ వ్యూహం అవసరమని పేర్కొంది.
అలాగేచ ఆర్ బిఐ గవర్నర్ అధ్యక్షతన ఎఫ్ ఎస్‌డిసి సబ్ కమిటీ చేపట్టిన కార్యకలాపాలు, ఇంతకముందు ఎఫ్ ఎస్ డిసి నిర్ణయాలపై సభ్యులు తీసుకున్న చర్యలను చర్చించింది.
***
(Release ID: 1680927)