ఆర్థిక మంత్రిత్వ శాఖ
జి.ఎస్.టి పరిహారంలో లోటును భర్తీచేసుకునేందుకు 7వ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రాష్ట్రాలకు బ్యాక్ టు బ్యాక్ రుణం కింద రూ6000 కోట్లలు విడుదల చేసిన కేంద్రం.
అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకూ మొత్తం 42 వేల కోట్ల రూపాయల మొత్తం విడుదల.
రాష్ట్రాలకు అనుమతించిన అదనపు రుణ అనుమతి రూ 1,06,830 కి ఇది అదనం.
Posted On:
14 DEC 2020 4:44PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, రాష్ట్రాలు తమకు జిఎస్‌టి పరిహారంలో ఏర్పడే లోటును భర్తీ చేసుకునేందుకు 7వ విడత కింద 6000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో 5,516.60 కోట్ల రూపాయలను 23 రాష్ట్రాలకు, విడుదల చేయడం జరిగింది. ఇందులో 483.40 కోట్ల రూపాయలు లెజిస్లేటివ్ అసెంబ్లీలు కలిగిన మూడు కేంద్రపాలిత ప్రాంతాలు (ఢిల్లీ, జమ్ము కాశ్మీర్, పుదుచ్చేరి లకు విడుదల చేశారు. ఈ రాష్ట్రాలు జిఎస్‌టి కౌన్సిల్ లో సభ్యులుగా ఉన్నాయి.మిగిలిన 6 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం. వీటికి జిఎస్టి అములతో రెవిన్యూ గ్యాప్ ఏదీ లేదు.
జి.ఎస్.టి అమలు వల్ల ఏర్పడనున్న 1.10 లక్షల కోట్ల రూపాయల రెవిన్యూ లోటును దృష్టిలో ఉంచుకుని 2020లో భారత ప్రభుత్వం ప్రత్యేక రుణ విండోను ఏర్పాటు చేసింది. ఈ విండో ద్వారా భారత ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల తరఫున
రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల తరఫున భారత ప్రభుత్వం రుణాలను ఈ విండోలద్వారా సమకూరుస్తుంది. ఈ రుణసేకరణ ఏడు విడతలుగా జరిగింది. ఇప్పటివరకూ సమకూర్చుకున్న రుణాన్ని రాష్ట్రాలకు 2020 అక్టోబర్ 23న, 2020 నవంబర్ 2న, 2020 నవంబర్ 9న, 2020 నవంబర్ 23 న, 2020 డిసెంబర్ 1న , 2020 డిసెంబర్ 7న, 2020 డిసెంబర్ 14న విడుదల చేసింది.
ఈ వారం విడుదల చేసిన మొత్తం రాష్ట్రాలకు విడుదల చేసిన ఈ తరహా నిధుల కోవలో 7వ ఇన్‌స్టాల్‌మెంట్. ప్రస్తుత వారం తీసుకున్న రుణానికి వడ్డీ 5.1348 శాతం. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 42,000 కోట్ల రూపాయలను ప్రత్యేక రుణ సమీకరణ పథకం కింద 4.7712 శాతం సగటు వడ్డీ .
జిఎస్‌టి అమలువల్ల తగ్గిన రెవిన్యూను భరత్ఈ చేసుకోవడానికి స్పెషల్ బారోయింగ ద్వారా నిధులు సమకూర్చడమే కాక, రాష్ట్రాలకు , స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జిఎస్‌డిపి)లో 0.50 శాతానికి సమానమైన మొత్తాన్ని అదనంగా రుణంగా సమకూర్చుకునేందుకు భారత ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆప్షన్ -1ని ఎంచుకున్న రాష్ట్రాలకు జిఎస్‌టి పరిహారంలో లోటు ను బర్తీ చేసుకోవడానిఇక , అదనపు ఆర్ధిక వనరులను సమకూర్చుకోవడానికి ఈ అవకాశం ఇచ్చారు. అన్ని రాష్ట్రాలూ ఆఫ్షన్ =1ను ఎంచుకన్నాయి. ఇందుకు సంబంధించి మొత్తం అదనపు సొమ్ము 1,06,830 కోట్ల రూపాయలు (0.50 జిఎస్‌డిపిలో 5 శాతం)ను ఈ ప్రొవిజన్ కింద 28 రాష్ట్రాలకు కేటాయించారు.
అదనపు రుణాలు సమకూర్చుకోవడానికి 28 రాష్ట్రాలకు అనుమతి మంజూరు చేసిన మొత్తము, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పెషల్ విండో కింద మొత్తాన్ని అనుబంధంలో చేర్చడం జరిగింది.
రాష్ట్రాల వారీగా అదనపు రుణ సేకరణ జిఎస్‌డిపిలో 0.50 శాతాన్ని అనుమతించారు. స్పెషల్‌విండో కింద సేకరించిన మొత్తాన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు 14-12-2020 వరకు పంపిణీ చేసిన మొత్తం కోట్ల రూపాయలలో అనుబంధంలో సూచించడం జరిగింది.
***
(Release ID: 1680666)
Visitor Counter : 144