రైల్వే మంత్రిత్వ శాఖ

స‌బ‌ర్బ‌న్ ప్రాంతాల‌కు, కొన్ని జోన్ల‌లో ప‌‌రిమిత సంఖ్య‌లో న‌డుస్తున్న లోక‌ల్ ప్యాసింజ‌ర్ రైళ్ళ‌కు మాత్ర‌మే అన్‌‌రిజ‌ర్వ‌డ్ టికెట్లు జారీ చేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌డం జ‌రిగింది

పండుగ‌ల స్పెషల్్స‌, క్లోన్ స్పెష‌ల్్స స‌హా అన్ని ఎక్్స‌ప్రెస్ రైళ్ళ‌ను పూర్తి రిజ‌ర్వేష‌న్‌తో న‌డిపే విధానంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి మార్పు లేదు

త‌దుప‌రి మార్పులు జ‌రిగిన వెంట‌నే సంబంధితులంద‌రికీ అందుకు అనుగుణంగా స‌మాచారం ఇవ్వ‌డం జ‌రుగుతుంది

Posted On: 13 DEC 2020 4:48PM by PIB Hyderabad

రిజ‌ర్వేష‌న్ చేయ‌ని టిక్కెట్ల‌కు సంబంధించి మీడియాలోని కొన్ని వ‌ర్గాల‌లో  ప‌లు క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌య్యాయి. దానికి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌నం చేసేందుకు కొన్ని అంశాల‌ను ఇవ్వ‌డం జ‌రిగింది -

పండుగ‌ల సంద‌ర్భంగా న‌డిపే ప్ర‌త్యేక రైళ్ళు స‌హా అన్ని ఎక్్స‌ప్రెస్ రైళ్ళు, క్లోన్ స్పెష‌ల్స్ అన్నీ కూడా పూర్తి రిజ‌ర్వేష‌న్ల‌తోనే ఇప్ప‌టి వ‌ర‌కూ న‌డపడం జ‌రుగుతోంది. 

త‌దుప‌రి సూచ‌న వ‌చ్చే వ‌ర‌కు ప్ర‌స్తుతం న‌డుస్తున్న మెయిల్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌త్యేక రైళ్ళు, పండుగ‌లు/ శ‌లువల‌ స్పెష‌ల్్స‌, క్లోన్ స్పెష‌ల్స్  అన్నీ కూడా  పూర్తిగా రిజ‌ర్వేష‌న్ ఆధారంగానే న‌డుస్తున్నాయి (నేటి వ‌ర‌కు).  సెకెండ్ క్లాస్ కోచ‌ల‌కు, ఎస్ ఎల్ ఆర్ కు చెందిన‌ ప్ర‌యాణీకుల భాగంతో కూడా వాటిని పూర్తిగా రిజ‌ర్వేష‌న్ల‌తో మాత్ర‌మే న‌డ‌ప‌డాన్ని కొన‌సాగిస్తాం.

కేవ‌లం స‌బ‌ర్బ‌న్ ప్రాంతాల‌కు, కొన్ని జోన్ల‌లో ప‌రిమిత సంఖ్య‌లో న‌డుస్తున్న లోక‌ల్ ప్యాసింజ‌ర్ రైళ్ళ‌కు  మాత్ర‌మే అన‌రిజ‌ర్వ‌డ్ టిక్కెట్ల‌ను జారీ చేసేందుకు జోన‌ల్ రైల్వేల‌కు అనుమ‌తి ఇవ్వ‌డం జ‌రిగింది.
రైళ్ళు న‌డ‌ప‌డం, ప్ర‌యాణ నియ‌మాలు, రిజ‌ర్వేష‌న్లు అన్నీ కూడా కోవిడ్ స‌మ‌యంలో నిరంత‌రం మార్పులు చెందుతున్నాయి. త‌దుప‌రి జ‌రిగే మార్పుల‌ను, అవి చోటు చేసుకున్న స‌మ‌యంలో సంబంధిత వ్య‌క్తులంద‌రికీ తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంది.

****


 


(Release ID: 1680500) Visitor Counter : 129