మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సహోదయ పాఠశాల సముదాయాల 26వ జాతీయ వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Posted On:
11 DEC 2020 6:41PM by PIB Hyderabad
కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సహోదయ స్కూల్ కాంప్లెక్స్‌ల 26వ జాతీయ వార్షిక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్లొని ప్రసంగించారు.ఈ సందర్భంగా సమర్థన్ పేరుతో రూపొందించిన సావనీర్ విడుదల చేశారు. దేశంలోని ఉత్తమ బోధనా పద్ధతుల సంకలనంగా దీనిని రూపొందించారు. XI మరియు XII తరగతుల కొరకు సమ్మిళిత విద్య, ఆనందంగా నేర్చుకోవడం మరియు శారీరక విద్యలకు సంబంధించి సీబీఎస్ఈ మాన్యువల్స్‌ను ఆయన విడుదల చేశారు. సమావేశంలో ప్రసంగించిన మంత్రి భారతదేశాన్ని స్వావలంబన కలిగిన దేశంగా మార్చడం మరియు ఆమెను అపరిమిత అవకాశాలతో నూతన భారతదేశంగా మార్చడానికి గాను ప్రతి పౌరుడి సామూహిక బాధ్యతను గురించి మంత్రి ఈ సందర్భంగా వివరించారు. నయీ తలీమ్ తత్వశాస్త్రంలో మహాత్మా గాంధీ నిర్దేశించిన ఆదర్శాలపై పని చేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. విస్తృతమైన సంప్రదింపులు, భాగస్వామ్య పక్షాల వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత తయారు చేయబడిన కొత్త విద్యా విధానం-2020 ను సమర్థవంతంగా అమలు చేయడానికి గాను అకుంఠిత ప్రయత్నాలు చేయాలని కోరారు. 21వ శతాబ్దానికి చెందిన సరికొత్త భారత్‌కు సంబంధించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ దృష్టి కోణం గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, అది నిజం కావడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మేటి సహకారంతో పనిచేయాలని కోరారు. గౌరవ అతిథిగా హాజరైన కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్య, సకాల శాఖ మంత్రి శ్రీ సురేష్ కుమార్ ఉత్తరాఖండ్ మరియు కర్ణాటక రెండు జత చేసిన రాష్ట్రాలను వర్ణించే ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమపు వీడియోను ఆవిష్కరించారు. విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీమతి అనితా కార్వాల్‌లు ఈ కార్యక్రమంలో భాగంగా దేశ విద్య యొక్క భవిష్యత్తుకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రసంగించారు. ప్రతి ఉపాధ్యాయుడు సంపూర్ణ విద్య యొక్క సాక్షాత్కారం తీసుకురావడానికి సవాళ్లను స్వీకరించి, వాటిని తగు అవకాశాలుగా మార్చాల్సిన అవసరముందని శ్రీమతి కార్వాల్ కోరారు. సీబీఎస్ఈ చైర్మన్ శ్రీ మనోజ్ అహుజా, ఎన్ఈపీ 2020 యొక్క విభిన్న అంశాలను గురించి వివరించారు. సదస్సు యొక్క ముఖ్య వక్తగా ఉన్న శ్రీమతి కిరణ్ మజుందార్ షా, బోధనా శైలుల్లో మార్పుకు ఉపాధ్యాయులు మరియు పిల్లలు ఎలా అలవాటు పడ్డారు అనే దాని గురించి మాట్లాడారు. సహోదయ స్కూల్ కాంప్లెక్స్‌ల 26వ జాతీయ వార్షిక సదస్సును సీబీఎస్ఈ నిర్వహించింది. బెంగళూరు సహోదయ స్కూల్స్ కాంప్లెక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. ఈ సహోదయ స్కూల్ జాతీయ వార్షిక సదస్సులో భారతదేశం మరియు విదేశాలల్లోని పాఠశాలల నుండి 4000 మందికి పైగా పాల్గొంటున్నారు.
***
(Release ID: 1680111)
Visitor Counter : 150