కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
స్కైలో భాగస్వామ్యంతో ప్రపంచ తొలి, ఉపగ్రహ ఆధారిత న్యారోబ్యాండ్ ఐఒటి నెట్ వర్క్‌ను ఇండియాలో ప్రవేశ పెట్టనున్న బిఎస్ఎన్ ఎల్ సంస్థ
Posted On:
10 DEC 2020 6:06PM by PIB Hyderabad
బిఎస్ఎన్ ఎల్ , స్కైలోటెక్ ఇండియా సంస్థ భాగస్వామ్యంతో ఉపగ్రహ ఆధారిత ఎన్.బి.- ఐఒటిని ఇండియాలో ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దార్శనికత కు అనుగుణంగా నిజమైన డిజిటల్ ఇండియాకు ఇది వీలు కల్పిస్తుంది. మత్స్యకారులు, రైతులు, నిర్మాణరంగం, మైనింగ్,లాజిస్టిక్ ఎంటర్ ప్రైజ్‌లనుంచి ఇది ప్రారంభమైంది. ఈ పరిష్కారంతో ఇండియాలో అనుసంధానత లేని మిలియన్ల కొద్దీ యంత్రాలు, సెన్సార్లు, పారిశ్రామిక ఐఒటి పరికరాలకు ఇది అనుసంధానత కల్పిస్తుంది.
ఈ కొత్త మేడ్ ఇన్ ఇండియా పరిష్కారాన్ని దేశీయంగా స్కైలో అభివృద్ధి చేసింది. దీనిని బిఎస్ఎన్ ఎల్ వారి ఉపగ్రహ భూ అనసంధానిత మౌలిక సదుపాయాలతో కలుపుతారు. ఇది ఇండియా మొత్తం కవరేజ్ కలిగి ఉంటుంది. దేశంలో ఏ ఒక్క ప్రాంతాన్నీ విడిచిపెట్టకుండా అనుసంధానతకు వీలు కల్పిస్తుంది. కాశ్మీర్, లద్దాక్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు, భారత సముద్రప్రాంతానికి కూడా అనుసంధానత కల్పిస్తుంది.
బిఎస్ ఎన్ ఎల్ సిఎండి పికె పుర్వార్ మాట్లాడుతూ, దేశంలోని వివిధ వర్గాల కస్టమర్లకు వినూత్నటెలికం సర్వీసులను అందుబాటు ధరలో అందించాలన్న బిఎస్ఎన్ఎల్ దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. లాజిస్టిక్ రంగానికి సంబంధించి కీలక డాటాను స్కైలో అందించడానికి సహకరించనుంది. 2021లో కొవిడ్-19 వాక్సిన్ పంపిణీకి అవసరమైన సేవలకు ఇది ఉపయోగపడనుంది. తద్వారా ఇది దేశానికి కీలక సేవలు అందించనుందని ఆయన తెలిపారు.
స్కైలో సంస్థ సహ వ్యవస్థాపకుడు , సిఇఒ శ్రీ పార్థసారథి త్రివేది మాట్లాడుతూ, శతాబ్దాలుగా పరిశ్రమలు, వ్యవసాయం, రైల్వే, మత్స్య పరిశ్రమ ఆఫ్‌లైన్ ద్వారా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఎఐ, ఐఓటి రంగంలో ఇప్పటివరకూ వచ్చిన ఆధునిక పోకడలను ఇవి అందిపుచ్చుకోలేకపోయాయన్నారు. ఇది ప్రపంచ మొట్టమొదటి ఉపగ్రహ ఆధారిత ఎన్.బి-ఐఒటి నెట్ వర్క్, దీనిని ఇండియాలో ప్రారంభించనుండడం గర్వకారణంగా ఉంది. ఇది దేశీయ పరిశ్రమలు, లక్షలాది మంది జీవితాలలో పరివర్తన తీసుకురానుంది. అని ఆయన అన్నారు.
బిఎస్ఎన్ఎల్ బోర్డు డైరక్టర్ (సిఎఫ్ఎ) శ్రీ వివేక్ బన్జాల్ మాట్లాడుతూ, పిఒసిలను విజయవంతంగా బిఎస్ఎన్ ఎల్, స్కైలో ఇండియా నిర్వహించాయని అన్నారు తాము త్వరలోనే అంటే 2021 కి ముందే యూజర్ గ్రూప్‌లను సంప్రదించనున్నట్టు ఆయన తెలిపారు.,
ఈ ఆవిష్కరణ గురించిన ప్రకటన సరైన సమయంలో వచ్చినదిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న 2020 ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సందర్భంగా ఈ ఆవిష్కరణ సమాచారం వెలువడింది. ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం డిపార్టమెంట్ ఆఫ్ టెలికం రంగానికి మద్దతునివ్వడంతోపాటు, దేశీయంగా ఐఒటి అనుసంధానతను ఇండియాలోని కీలక రంగాలకు కల్పించాలన్న నీతి ఆయోగ్ ప్రణాళికకు అనుగుణంగా ఉంది. భారతీయ రైల్వేలు, చేపలు పట్టే నౌకలు వంటి వాటి విషయంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్నిఇప్పటికే పరీక్షించి చూశారు
స్కైలో ఒక చిన్న పెట్టె రూపంలో యూజర్ టెర్మినల్ ఇంటర్‌ఫేస్ సెన్సర్లు కలిగి ఉండి ఇది డాటాను స్కైలో నెట్ వర్క్‌కు బట్వాడా చేస్తుంది. ఇది అక్కడనుంచి ప్రజల చేతుల్లోకి వస్తుంది. ఈ అనుసంధానిత డాటా ప్లాట్‌ఫారం ఆయా పరిశ్రమల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా మొబైల్ లేదా డెస్క్ టాప్‌ల ద్వారా ఉపయోగించడానికి వీలు కలుగుతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేవారు తక్షణం తగిన చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ నూతన డిజిటల్ యాంత్రిక అనుసంధానతా లేయర్, స్మార్ట్‌ఫోన్ కేంద్రిత మొబైల్, వైఫైనెట్‌వర్క్‌లకు అదనంగా తోడ్పడుతుంది. అలాగే దేశం మొత్తం భౌగోళిక ప్రాంతాన్ని ఇది కవర్‌చేస్తుంది. తద్వారా ఆన్‌లైన్ కొత్త అప్లికేషన్లను తొలిసారిగా అందుబాటులోకి తెస్తుంది.
***
.
(Release ID: 1679949)
Visitor Counter : 257